Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

దళితబంధుపై విచారణ: తెలంగాణ సర్కారుపై హైకోర్టు అసహనం!

దళితబంధుపై విచారణ: తెలంగాణ సర్కారుపై హైకోర్టు అసహనం
జీవోలను వెబ్ సైట్ లో ఎందుకు పెట్టట్లేదని నిలదీత
ప్రజలకు అందుబాటులో ఉంచితే ఇబ్బందేంటని ప్రశ్న
పిటిషన్ ను కొట్టేసిన సీజే హిమా కోహ్లీ ధర్మాసనం

ప్రభుత్వ జీవోలు ప్రజలకు అందుబాటులో ఉండేలా వెబ్ సైట్ లో పెట్టడానికి వచ్చిన ఇబ్బందేంటని తెలంగాణ సర్కారును హైకోర్టు నిలదీసింది. జీవోను ఇచ్చిన 24 గంటల్లోగా దాని కాపీని వెబ్ సైట్ లో పెట్టాల్సిందిగా ఆదేశాలిచ్చింది. యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో దళితబంధు పథకం అమలుపై దాఖలైన పిటిషన్ ను ఇవాళ హైకోర్టు విచారించింది. పథకానికి సంబంధించిన విధివిధానాలు, నిబంధనలను ఖరారు చేయకుండానే నిధులు విడుదల చేశారని ఆరోపిస్తూ ‘వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్’ అనే సంస్థ వేసిన ఆ పిటిషన్ ను.. చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డిల ధర్మాసనం విచారించింది.

పేద దళితులందరికీ పథకం వర్తిస్తుందని, దానికి సంబంధించి ఇప్పటికే నిబంధనలను ఖరారు చేశామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ప్రసాద్ కోర్టుకు తెలిపారు. దీంతో ఆ నిబంధనలను వ్యాజ్యంలో ఎందుకు పేర్కొనలేదంటూ పిటిషనర్ ను కోర్టు ప్రశ్నించింది. నిబంధనల జీవోను వెబ్ సైట్ లో పెట్టలేదని కోర్టుకు పిటిషనర్ వివరించారు. దీంతో ఆ జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికొచ్చిన ఇబ్బందేంటని సర్కారును హైకోర్టు ప్రశ్నించింది. ఆ పిటిషన్ ను కొట్టేసింది.

Related posts

స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచిన కేటీఆర్ తనయుడు హిమాన్షు!

Drukpadam

పులిచింత‌ల డ్యామ్ దగ్గర కొట్టక పోయిన గేటు…వృధాగా పోతున్న నీరు …

Drukpadam

పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం…

Drukpadam

Leave a Comment