Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నిర్బంధాల మధ్యనే కొనసాగుతున్న రైతుల ఉద్యమం

నిర్బంధాల మధ్యనే కొనసాగుతున్న రైతుల ఉద్యమం
నేడే రహదారుల దిగ్బంధనానికి రైతుల ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపు
నల్ల చట్టాలను రద్దు చేయాలనీ ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల ఉద్యమం నిర్బంధాల మధ్యనే కొనసాగుతుంది. ఈ ఉద్యమానికి కొనసాగింపుగా శనివారం నాడు ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలవరకు దేశవ్యాపిత రహదారుల నిర్బంధానికి పిలుపునిచ్చారు. రైతుల సంయుక్త ఐక్య కార్యాచరణ కమిటీ ఇచ్చిన ఈ పిలుపును అనేక రాజకీయ పార్టీలు , రైతు సంఘాలు , వివిధ ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో కేంద్ర అప్రమత్తమైంది. ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. పార్లమెంట్ లో రేట్ల సమస్యలపై పలువురు నేతలు గళం విప్పారు. నల్ల చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. 10 పార్టీలకు చెందిన 15 మంది ఎంపీ లు రైతుల దీక్ష శిభిరం వద్దకు వెళుతుండగా వారిని శిబిరానికి చేరకుండా అడ్డుకోవటం పై రాజకీయపార్టీలు మండి పడుతున్నాయి. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్బంగా జరిగిన రైతుల ట్రాక్టర్ పెరేడ్ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలకు కేంద్రమే బాధ్యత వహించాలని పార్లమెంట్ లో పలు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. జైకిసాన్ అంటూ ఎంపీ చేసిన నినాదాల తో సభ దద్దరిల్లింది . ఎంపీ లు ప్లే కార్డులతో పోడియం చుట్టుముట్టి నినాదాలు చేయటంతో స్పీకర్ చేసిన విజ్నప్తి సైతం ఎవరికీ వినిపించలేదు. చేసేది లేక లోకసభ స్పీకర్ సభను కొద్దీ సేపు వాయిదా వేశారు. తిరిగి సభ సమావేశమైనప్పటికీ గందరగోళం మధ్యనే ప్రస్నోత్తరాలను కొనసాగించారు. మూడుసార్లు వాయిదా వేసినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోటంతో సభను వాయిదా వేశారు. భారత్ లో జరుగుతున్నా ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్దతు లభిస్తుంది.ఐక్యరాజ్యసమితి రైతులు శాంతి యుతంగా తమకోరికలను వెల్లడించుకొనే హక్కు ఉందని తెలిపింది. పలువురు సెలబ్రిటీలు కూడా రైతుల ఉద్యమానికి తమ మద్దతు తెలిపారు. జనవరి 26 జరిగిన సంఘటనలతో ఉద్యమం తగ్గిపోయిందని ఇక చట్టాల అమలుకు ఇబ్బంది లేదని భావించిన కేంద్రప్రభుత్వానికి నిరాశే మిగిలింది. ఉద్యమం రెట్టింపు అయింది. పోలిసుల నిర్బంధాలను సైతం లెక్కచేయకుండా మరింత పట్టుదలతో రైతులు దీక్ష శిబిరాల వద్దకు చేరుకున్నారు. ఇంకా చేరుకుంటున్నారు. దేశవ్యాపితంగా ఉద్యమానికి మద్దతు లభిస్తుంది. రాజ్య సభలో మాజీ ప్రధాని దేవెగౌడ మాట్లాడుతూ , జీవితం చరమాంకంలో అడుగుతున్నా రైతు చట్టాలను రద్దు చేయండి. జనవరి 26 జరిగిన ఘటనకు రైతులు ఏమాత్రం భాద్యులు కారాని అన్నారు.

Related posts

నాదే సీటు …కందాల……పోటీ ఖాయం తుమ్మల …పొత్తులో మాదే…తమ్మినేని …

Ram Narayana

రేణుకాచౌదరితో పొంగులేటి ఏకాంత చర్చలు …మెత్తబడ్డ ఫైర్ బ్రాండ్

Drukpadam

తమిళనాడులో డీఎంకే కూటమికి బీటలు…

Drukpadam

Leave a Comment