Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తిరుపతి సభలో జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కిషన్‌రెడ్డి!

తిరుపతి సభలో జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కిషన్‌రెడ్డి
-ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది
-మోదీ అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నారు
-రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి కృషి

బీజేపీ ఆధ్వర్యంలో నిన్న తిరుపతిలో నిర్వహించిన జన ఆశీర్వాద యాత్ర అనంతరం జరిగిన సభలో మాట్లాడిన కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మార్పు కోసం అధికారం అప్పగించిన ప్రజలకు సమన్యాయం చేయాలని జగన్‌కు సూచించారు. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వేసినా, వేయకున్నా ప్రధాని మోదీ అన్ని అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నారని, కానీ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అందరినీ అలా చూడడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దేశ సమైక్యతకు, సమగ్రతకు పాటుపడుతున్న మోదీని అందరూ ఆశీర్వదించాలని కోరారు.

పామాయిల్ రైతులకు లబ్ధి చేకూర్చాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని, ఈ విషయాన్ని తిరుపతి సభలో ప్రకటించాలని మోదీ తనతో చెప్పారన్నారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తానన్న కిషన్‌రెడ్డి కడప జిల్లా గండికోట, సింహాచలం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే సభలో పాల్గొన్న ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ..రాష్ట్రంలో అప్పుల పాలన సాగుతోందని విమర్శించారు.

Related posts

భారత సమగ్రతను ప్రశ్నించే శక్తులతో రాహుల్ కు సంబంధాలా?: బీజేపీ

Drukpadam

దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరతపై కేరళ సీఎం ఆందోళన:కేంద్రంపై వత్తిడికి కలిసి రావాలని11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ…

Drukpadam

బండి సంజయ్‌ బండారం బయట పెడతా : మైనంపల్లి…

Drukpadam

Leave a Comment