హైద్రాబాద్ వార్తలు

హైదరాబాద్‌లో ఘోరం.. స్కూటీని ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన డీసీఎం.. మహిళ మృతి…

హైదరాబాద్ ఐటీ హబ్ మాదాపూర్‌లో శనివారం రాత్రి ఘోర‌ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ డీసీఎం వాహనం స్కూటీపై వెళుతున్న దంపతులను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీ వెనుక కూర్చున్న మహిళ వాహనం కింద చిక్కుకోగా, డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా దాదాపు కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ దుర్ఘటనలో హనియా ఆయేషా (22) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త అబ్దుల్ బాసిత్ (26) తీవ్రంగా గాయపడ్డాడు.

పోలీసుల వివరాల ప్రకారం కేరళకు చెందిన ఈ దంపతులు నగరంలోని మలబార్ గోల్డ్ స్టోర్‌లో పనిచేస్తున్నారు. శనివారం రాత్రి కూకట్‌పల్లిలో సినిమా చూసి తిరిగి మహేశ్వరంలోని తమ ఇంటికి వెళ్తుండగా మైండ్‌స్పేస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. డీసీఎం ఢీకొన్న వేగానికి అబ్దుల్ బాసిత్ రోడ్డు పక్కన పడిపోగా, ఆయేషా స్కూటీతో పాటు డీసీఎం కింద చిక్కుకుంది. వాహనం కింద నుంచి మంటలు, అరుపులు వస్తున్నా డ్రైవర్ వాహనాన్ని ఆపలేదు. ఇది గమనించిన స్థానికులు, ఇతర వాహనదారులు డీసీఎంను వెంబడించి అడ్డుకున్నారు. వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారవ్వగా, క్లీనర్‌ను పట్టుకున్న జనం దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయేషా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అబ్దుల్ బాసిత్‌కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్న ఈ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

Related posts

హైదరాబాదులో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్!

Ram Narayana

హైదరాబాద్ శివార్లలో కాల్పుల కలకలం.. గోరక్షక్‌పై ఇబ్రహీం అనే వ్యక్తి కాల్పులు

Ram Narayana

మున్సిపల్ ఎన్నికలతో బల్దియాలకు కాసుల పంట.. రూ.7.42 కోట్ల పన్ను కట్టిన నేత!

Ram Narayana