ప్రముఖ నటి సుభాషిని ఆత్మహత్య?
తమిళ బుల్లితెరపై తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటి సుభాషిణి (36) బలవన్మరణానికి పాల్పడటం సినీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. చెన్నైలోని పోరూరులో ఉన్న ఒక ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీలంకకు చెందిన సుభాషిణి, బెంగళూరుకు చెందిన పిప్పిన్‌ను వివాహం చేసుకున్నారు. వృత్తిరీత్యా షూటింగ్‌ల కోసం ఆమె చెన్నైలో ఒంటరిగా నివసిస్తుండగా, భర్త బెంగళూరులో ఉంటున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఆదివారం రాత్రి సుభాషిణి తన భర్త పిప్పిన్‌తో వీడి యో కాల్‌లో మాట్లాడారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, వీడియో కాల్ ముగిసిన వెంటనే ఈ దారుణ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
భర్తతో ఉన్న కుటుంబ కలహాలే ఆమె ఆత్మహత్య కు ప్రధాన కారణమని ఆమె స్నేహితులు కూడా పోలీసులకు తెలిపారు. సుభాషిణి కేవలం నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో చురుకుగా ఉండేవారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కయల్’ సీరియల్ ద్వారా ఆమె మంచి గుర్తింపు పొందారు ..
Save or share this story as a newspaper-style Epaper Clip: