తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష ఖరారు చేస్తూ మదురై సెషన్స్ కోర్టు సంచలన తీర్పు
9 మంది పోలీసులకు మరణ శిక్ష విధిస్తు తమిళనాడులోని మదురై సెషన్స్ కోర్ట్ సంచలన తీర్పు చెప్పింది .వివరాల్లోకి వెళ్ళితే 2020 లాక్ డౌన్ లో మొబైల్ షాప్ తెరిచి ఉంచారని తండ్రి కొడుకులను అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టడంతో వారు పోలిసుల చిత్ర హింసలు తట్టుకోలేక మరణించారు . ఇది అప్పట్లో పెద్ద కెహెర్చనీయాంశం అయింది .పోలీసుల చర్యలను పౌరసమాజం ,రాజకీయపార్టీలు , ప్రజాసంఘాలు ,పౌరహక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి ..తండ్రి కొడుకుల మరణానికి 9 మంది పోలీసులు కారణమని కోర్ట్ నిర్దారించింది .దీంతో ఆ తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష వేసిన మదురై సెషన్స్ కోర్టు తీర్పు..ఇది దేశంలోనే సంచలన తీర్పుగా మారింది .పోలీసులకు మరణ శిక్ష విధించడం పై కేసు పూర్వాపరాలు తెలుసుకొనేందుకు నోటీజన్లు ప్రయత్నాలు ప్రారంభించారు ..
Save or share this story as a newspaper-style Epaper Clip: