Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తాలిబన్లతో కలిసి పని చేసేందుకు సిద్ధమంటూ బ్రిటన్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు!

తాలిబన్లతో కలిసి పని చేసేందుకు సిద్ధమంటూ బ్రిటన్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఆఫ్ఘన్ సంక్షోభానికి పరిష్కారం చూపేందుకు అవసరమైతే కలిసి పని చేస్తాం
రాజకీయ, దౌత్యపరమైన చర్యలు చేపడతాం
కాబూల్ ఎయిర్ పోర్టులో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి
అమెరికా సహా అన్ని దేశాలతో మాకు సంబంధాలు కావాలి: తాలిబన్​ సహ వ్యవస్థాపకుడు బరాదర్​
సంబంధాలొద్దని మేమెప్పుడూ అనలేదు
అవన్నీ వట్టి పుకార్లే.. నిజం కాదు
రాజకీయ పార్టీలతో బరాదర్ భేటీ
ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న చర్చలు

ఆప్ఘనిస్థాన్ ను అధీనంలోకి తీసుకున్న తాలిబన్లతో కలిసి పని చేసేందుకు తమకు అభ్యంతరం లేదని ఇప్పటికే చైనా ప్రకటించింది. పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కూడా మద్దతు ప్రకటించారు. రష్యా కూడా తాలిబన్లకు అనుకూలంగానే మాట్లాడింది. ఇప్పుడు తాజాగా మరో అగ్రరాజ్యం తాలిబన్లకు ఊరట కలిగించే వ్యాఖ్యలు చేసింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభానికి పరిష్కారాన్ని చూపేందుకు అవసరమైతే తాలిబన్లతో కలిసి పని చేసేందుకు సిద్ధమని సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు అవసరమైతే రాజకీయ, దౌత్యపరమైన చర్యలను చేపడతామని చెప్పారు.

కాబూల్ ఎయిర్ పోర్టులో పరిస్థితులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయని ఆయన తెలిపారు. కాబూల్ నుంచి ఇప్పటి వరకు 1,165 మందిని బ్రిటన్ కు తరలించామని… వీరిలో బ్రిటన్ పౌరులు 399 మంది కాగా… రాయబార కార్యాలయ సిబ్బంది 320 మంది, ఆఫ్ఘన్లు 402 మంది ఉన్నారని చెప్పారు. ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్ల అకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో బోరిస్ జాన్సన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

అమెరికాతోనూ సంబంధాలు అవసరమే…ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్

ప్రపంచంలోని అన్ని దేశాలతో తమకు దౌత్య, వాణిజ్య సంబంధాలు కావాలని, అమెరికాతోనూ సంబంధాలు అవసరమేనని తాలిబన్లు ప్రకటించారు. ఇవాళ తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఆయన దీనిపై ట్వీట్ చేశారు. ఏ దేశంతోనూ తాలిబన్లు సంబంధాలు కోరుకోవట్లేదన్న వార్తలను కొట్టిపారేశారు. తామెప్పుడూ అలా మాట్లాడలేదన్నారు. ఇవన్నీ లేనిపోని పుకార్లేనని, వాటిలో వాస్తవం లేదని అన్నారు.

కాగా, దేశంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం బరాదర్ కాబూల్ కు చేరుకున్నారు. రాజకీయ పార్టీల నేతలతో చర్చిస్తున్నారు. అయితే, ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమించినప్పటి నుంచి తాలిబన్లు ప్రపంచాన్ని నమ్మించే పనిలోనే ఉన్నారు. తాము ఏ ఉగ్రవాద సంస్థతోనూ సంబంధాలు పెట్టుకోబోమని, దేశాభివృద్ధి కోసం ప్రయత్నిస్తామని చెబుతూ వస్తున్నారు. తమను ప్రపంచం గుర్తించాలని కోరుతున్నారు.

Related posts

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ ….ఇకనుంచి నయా ఫీచర్లు!

Drukpadam

నకిలీ సీబీఐ అధికారికి బంగారం, డబ్బు ఇచ్చిన హైదరాబాదీ వ్యాపారవేత్తలకు సీబీఐ నోటీసులు!

Drukpadam

తాను గర్భవతినని తెలుసుకున్న మరుసటి రోజే బిడ్డకు జన్మనిచ్చిన బ్రిటన్ యువతి!

Drukpadam

Leave a Comment