Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

పరిటాల సునీతకు షాక్ …బుల్లెట్ వ్యవహారంలో చిన్న కొడుకు సిద్దార్థ్!

పరిటాల సునీతకు షాక్ …బుల్లెట్ వ్యవహారంలో చిన్న కొడుకు సిద్దార్థ్!
-పరిటాల సిద్ధార్థ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
-పరిటాల సిద్ధార్థ్ వద్ద దొరికిన బుల్లెట్ సైన్యం వాడేదట!
-శంషాబాద్ విమానాశ్రయంలో సిద్ధార్థ్ బ్యాగులో బుల్లెట్ లభ్యం
-సైనికులు వాడే ఇన్సాస్ రైఫిల్స్ బుల్లెట్ గా గుర్తింపు
-సిద్ధార్థ్ కు ఈ బుల్లెట్ ఎలా వచ్చిందనే దానిపై విచారణ ప్రారంభం

అసలే అధికారంలో లేక ఇబ్బంది పడుతున్న టిడిపి నేతలకు వరుస కష్టాలు వచ్చి పడుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి పరిటాల సునీత కు కొడుకు వ్యవహారం పెద్ద తలనొప్పిగా తయారైంది. పరిటాల సునీత చిన్న కొడుకు సిద్ధార్థ్ శ్రీనగర్ వెళ్ళటం కోసం ఎయిర్ పోర్టుకు వెళ్లి బ్యాగ్ లో బుల్లెట్టు దొరికి పోవడంతో ఈ బుల్లెట్ వ్యవహారం గట్టిగానే పరిటాల కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంది.

దివంగత పరిటాల రవి చిన్న కుమారుడు పరిటాల సిద్దార్థ్ మరింత చిక్కుల్లో కూరుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో సిద్ధార్థ్ బుల్లెట్ తో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుల్లెట్ ను ఎయిర్ పోర్ట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు వివరణ ఇవ్వాలంటూ సిద్ధార్థ్ కు నోటీసులు ఇచ్చారు.

వాస్తవానికి సిద్ధార్థ్ కు పాయింట్ 32 క్యాలిబర్ గన్ కు లైసెన్స్ ఉంది. అయితే సిద్ధార్థ్ బ్యాగులో లభ్యమైన బుల్లెట్ 5.56 క్యాలిబర్. ఇప్పుడు ఇదే సిద్ధార్థ్ కు ఇబ్బందులు తీసుకురాబోతోంది. సైనికులు వాడే ఇన్సాస్ రైఫిల్స్ లో ఈ బుల్లెట్లను వాడతారు. దీంతో, ఈ బుల్లెట్ సిద్ధార్థ్ కు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ ప్రారంభమైనట్టు సమాచారం. ఈ బుల్లెట్ అనంతపురం జిల్లాకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (సైన్యంలో ఒక విభాగం)లో పని చేస్తున్న ఒక సైనికుడిదని చెపుతున్నారు. పరిటాల కుటుంబంతో సదరు వ్యక్తికి పరిచయం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పరిటాల సునీత చిన్న కొడుకు బ్యాగ్ లో బుల్లెట్ .. ఎయిర్పోర్ట్ పోలీసుల కేసు నమోదు అసలు ఇంతకీ ఏం జరిగిందంటే మాజీ మంత్రి పరిటాల సునీత చిన్న కొడుకు సిద్ధార్థ ఆగస్టు 18వ తేదీన ఉదయం శ్రీనగర్ వెళ్లడానికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు. స్నేహితులతో కలిసి శ్రీనగర్ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో బ్యాగ్ ను పరిశీలించిన సిఐఎస్ఎఫ్ సిబ్బంది పరిటాల సిద్ధార్థ బ్యాగ్లో 5.5 ఎం ఎం బుల్లెట్ కనుగొన్నారు. సాయుధ బలగాలు వాడే బుల్లెట్ సిద్ధార్థ్ బ్యాగ్ లో దొరకటంతో ఎయిర్ పోర్ట్ పోలీసులకు సమాచారం అందించారు. బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్న ఎయిర్ పోర్ట్ పోలీసులు ఆయుధాల చట్టం కింద పరిటాల సిద్ధార్థ్ పై కేసు నమోదు చేశారు.

విచారణకు హాజరైన పరిటాల సిద్ధార్థ్ .. పరిటాల సిద్ధార్థ్ బ్యాగ్ లో దొరికిన బుల్లెట్ తన దగ్గరకు ఎక్కడి నుండి వచ్చిందో సమాధానం చెప్పాలని 41 సిఆర్పిసి ప్రకారం నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. పోలీసులు ,ఆర్మీ వాళ్ల దగ్గర ఉండే బుల్లెట్ అతని దగ్గరకు ఎలా వచ్చిందో చెప్పాలని ,ఎవరిచ్చారో చెప్పాలని పేర్కొన్నారు. అయితే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన పరిటాల సిద్ధార్థ పోలీసుల నోటీసులకు సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తుంది.

సమాధానం ఇవ్వకపోవటంతో బిగుస్తున్న ఉచ్చు బ్యాగ్ లో బుల్లెట్ ఉందని, దానికి కావలసిన పత్రాలు తనవద్ద లేవనే విషయం తనకు తెలియదని పరిటాల సిద్ధార్థ పేర్కొన్నట్లు సమాచారం. దీంతో మరోమారు హాజరు కావాల్సి ఉంటుందని సిద్ధార్థ ను పోలీసులు ఆదేశించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల సలహాతో ఎయిర్ పోర్ట్ పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకోనున్నారు. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని డెడ్లైన్ విధించారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బుల్లెట్ వ్యవహారంలో పరిటాల సునీత చిన్న కొడుకు పరిటాల సిద్ధార్థ పోలీసులకు సరైన సమాధానం చెప్పలేక పోతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలో పరిటాల సిద్ధార్థ కు ఉచ్చు బిగిస్తున్నట్టు కనిపిస్తుంది.

పరిటాల సిద్ధార్థ్ వద్ద దొరికిన బుల్లెట్ ఇన్సాస్ రైఫిల్ బుల్లెట్ .. కొనసాగుతున్న దర్యాప్తు పరిటాల సిద్ధార్థ కు లైసెన్స్ ఉన్న గన్ ఉంది . కానీ అది పాయింట్ 32 క్యాలిబర్ గన్. ఎయిర్ పోర్ట్ లో సిద్ధార్థ బ్యాగ్ లో దొరికింది 5.5 క్యాలిబర్ బుల్లెట్, దానిని సాయుధ బలగాలు వాడే ఇన్సాస్ రైఫిల్ బుల్లెట్ గా గుర్తించారు. అయితే అనంతపురానికి చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కు సంబంధించిన బుల్లెట్ గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కానిస్టేబుల్ తో పరిటాల కుటుంబానికి పరిచయాలు ఉన్న నేపథ్యంలో అతని బుల్లెట్, సిద్ధార్థ వద్దకు ఎలా వచ్చిందన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు ముందు ముందు ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.

 

Related posts

వీధి గొడవలో కాల్పులు.. బంగ్లా పైనుంచి చూస్తున్న మహిళకు తగిలిన బుల్లెట్

Ram Narayana

లిఫ్ట్ లో ఇరుక్కుని ఉపాధ్యాయిని మృతి!

Drukpadam

సింగరేణి కాలనీ లో సంఘటనపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం …నిందితున్ని కచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తామని హెచ్చరిక!

Drukpadam

Leave a Comment