Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేంద్ర రాష్ట్రప్రభుత్వాలపై సిపిఐ సిపిఎం విమర్శలు
-వివేకా హత్యపై రామకృష్ణ , కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాయడంపై మధు ల ధ్వజం
-వివేకా హత్యకేసులో ఆధారాలిస్తే పారితోషికం ఇస్తామనడం సిగ్గుచేటు: సీపీఐ రామకృష్ణ
-ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న రామకృష్ణ
-వివేకా హత్య కేసు నేపథ్యంలో వ్యాఖ్యలు
-వెలిగొండ ప్రాజెక్టుపైనా స్పందన
-పనులు పూర్తయినా నీళ్లు రావడంలేదని వెల్లడి
-కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోంది: సీపీఎం మధు
-విజయవాడలో మీడియాతో మాట్లాడిన మధు
-ఆర్థిక వనరులు హరిస్తోందని వ్యాఖ్యలు
-విభజన హామీలు అమలు చేయడంలేదని ఆరోపణ
-నిరసనలు చేపడతామని వెల్లడి

సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద హత్య కేసుపై స్పందించారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన, వివేకా హత్య కేసులో కీలక సమాచారం అందించినవారికి సీబీఐ రూ.5 లక్షలు నజరానా ప్రకటించడంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకేసులో ఆధారాలిస్తే పారితోషికం ఇస్తామనడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. వివేకాను చంపింది ఎవరో పులివెందుల ఎమ్మెల్యే, కడప ఎంపీలను అడిగితే చెబుతారని పేర్కొన్నారు.

ప్రకాశం జిల్లా అంశాలపై వ్యాఖ్యానిస్తూ, వెలిగొండ ప్రాజెక్టును కేంద్రం గెజిట్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. పనులు పూర్తయినా నీళ్లు విడుదల చేయని ఏకైక ప్రాజెక్ట్ వెలిగొండ అని తెలిపారు. టిడ్కో ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతోందని విమర్శించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోంది: సీపీఎం మధు

సీపీఎం ఏపీ కార్యదర్శి మధు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని అన్నారు. అటవీ, మైనర్ పోర్టులపై చట్ట సవరణలు చేసి రాష్ట్రాల ఆర్థిక వనరులను హరిస్తోందని ఆరోపించారు. ఏపీకి విభజన హామీలు అమలు చేయడంలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబరు 15 నుంచి 30 వరకు నిరసనలు చేపడతామని వెల్లడించారు.

ఇటు, వైసీపీ ప్రభుత్వం కూడా ఏపీకి రావాల్సిన ప్రయోజనాలను రాబట్టడంలో విఫలమైందని మధు విమర్శించారు. పన్నుల చట్టాన్ని తెచ్చిన బీజేపీకి వైసీపీ మద్దతిస్తోందని అన్నారు.

Related posts

అసెంబ్లీ సమావేశాలు మొక్కుబడిగానేనా ….?ప్రజాసమస్యలు పట్టవా ??

Drukpadam

విజయసాయిరెడ్డి కి జగన్ బంపర్ ఆఫర్-ఇక వాటన్నింటికీ ఆయనే ఇన్ ఛార్జ్!

Drukpadam

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద కన్నీరు పెట్టిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి !

Drukpadam

Leave a Comment