Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఏపీ స్కూళ్లలో కరోనా కలకలం….

ఏపీ స్కూళ్లలో కరోనా కలకలం
కృష్ణా జిల్లాలో ఒకే స్కూల్లో 10 మంది విద్యార్థులకు కరోనా
ప్రకాశం జిల్లా స్కూల్లో ముగ్గురు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థులకు కరోనా
ఏపీలో ఇటీవలే ప్రారంభమైన పాఠశాలలు

ఏపీలో పాఠశాలలు మళ్లీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రతి రోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు పాఠశాలల్లో కూడా కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో డీఆర్ఎం మున్సిపల్ స్కూలులో ముగ్గురు ఉపాధ్యాయులు, ముగ్గురు చిన్నారులు కరోనా బారిన పడ్డారు.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఎంపీసీ కండ్రిగలోని స్కూలులో ఐదుగురు విద్యార్థులకు కరోనా సోకింది. కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు హైస్కూల్లో 10 మందికి కరోనా సోకింది. దీంతో ఈ పాఠశాలకు విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించారు. పాఠశాలల్లో కరోనా కేసులు వస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలనీ తల్లిదండ్రులు కోరుతున్నారు. కొన్ని రాష్ట్రాలలో స్కూల్స్ ,కాలేజీలను ప్రారంభించాలని డిమాండ్ ఉంది. కర్ణాటకలో విద్యాసంస్థలు ప్రారంభించారు. తెలంగాణాలో కూడా సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి విద్య సంస్థలు ప్రారంభించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఏపీ ప్రభుత్వ కూడా విద్యాసంస్థలపై ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందో చూడాలి ….

Related posts

రోడ్డుపై ఆ పని చేయడం బ్యాన్.. అవసరమైతే 144 సెక్షన్’:కేంద్ర హోమ్ శాఖ!

Drukpadam

మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత…

Drukpadam

అమెరికాలో రోజుకు 3 వేల మంది మృతి.. కొవిడ్ ఆంక్షలు సడలిస్తున్న ఫిన్లాండ్!

Drukpadam

Leave a Comment