Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అట్టహాసంగా బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం!

అట్టహాసంగా బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం
-అంతకు ముందు చార్మినార్ వద్ద భారీ బహిరంగ సభ
-హాజరైన బీజేపీ రాష్ట్ర అగ్రనేతలు
-టీఆర్ యస్ , ఎంఐఎం పైన నిప్పులు చెరిగిన కిషన్ రెడ్డి ,బండి సంజయ్
-రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం నింపేందుకే పాదయాత్ర చేస్తున్నాన్న బండి సంజయ్
-దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మాటతప్పారు అని విమర్శ
-దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న మాటను నెరవేర్చలేదని ధ్వజం
-దళిత బంధు పేరిట దళితులను వంచించే కార్యక్రమం చేపట్టారని ఎద్దేవా
-బీసీల్లో కూడా చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని వాఖ్య

రెండు సార్లు వాయిదా పడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మహాసంగ్రామ యాత్ర శనివారం ప్రారంభమైంది. హైద్రాబాద్ పాట బస్తీలోని మహంకాళి అమ్మవారి గుడిలో పూజల అనంతరం యాత్రను బీజేపీ రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకు ముందు చార్మినార్ వద్ద జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో సహా పలువురు నేతలు పాల్గొని కేసీఆర్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు . రాష్ట్రంలో ప్రజావ్యతిరేక దుర్మార్గమైన పాలనా సాగుతుందని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కేసీఆర్ పాలనకు 2023 ఎన్నికల్లో చరమగీతం పాడాల్సిందేనని ఉద్గాటించారు.

దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మాటతప్పారని, అలాగే దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న మాటను నెరవేర్చలేదని విమర్శించారు. దళిత బంధు పేరిట దళితులను వంచించే కార్యక్రమం చేపట్టారని అన్నారు. బీసీల్లో కూడా చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయట్లేదని నిలదీశారు. 27 మంది బీసీలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించిన ఘనత బీజేపీదేనని చెప్పారు. రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం నింపేందుకే పాదయాత్ర చేస్తున్నానన్నారు.

రాష్ట్రంలో రెండు కుటుంబాలే బాగు పడ్డాయి

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిచేది బీజేపీనే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బండి సంజయ్ పాదయాత్రతో కేసీఆర్ పీఠాలు కదులుతాయని చెప్పారు. హుజూరాబాద్ లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తారా? లేదా? అని ప్రశ్నించారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని చెప్పారు.

రాష్ట్రంలో రెండు కుటుంబాలే బాగు పడ్డాయని అందులో ఒకటి కల్వకుంట్ల కుటుంబం కాగా , రెండవది ఒవైసి కుటుంబమని అన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్ అప్పుల తెలంగాణ చేశారని విమర్శించారు. ఇక తెలంగాణ ప్రజలు కేసీఆర్ మోసపు మాటలు నమ్మే పరిస్థితులు లేవని అన్నారు. 2023 ఎన్నికల్లో తెలంగాణాలో కాషాయం జెండా ఎగరడం ఖాయమని అన్నారు.

Related posts

చెత్త రాజకీయాల కంటే కొన్ని సార్లు వారసత్వ రాజకీయాలే మేలు: అభిషేక్‌ బెనర్జీ…

Drukpadam

మునుగోడు ప్రచారానికి కేసీఆర్.. మూడు రోజులు అక్కడే మకాం!

Drukpadam

అమిత్ షా సవాల్ ను స్వీకరిస్తున్నాం: ఉద్ధవ్ థాకరే!

Drukpadam

Leave a Comment