Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మోడీ ప్రభుత్వనవి ప్రజావ్యతిరేక విధానాలు …. దేశ వ్యాపిత ప్రతిఘటన తప్పదు :వడ్డే

మోడీ ప్రభుత్వనవి ప్రజావ్యతిరేక విధానాలు …. దేశ వ్యాపిత ప్రతిఘటన తప్పదు :వడ్డే
-ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన మాజీ మంత్రి
-వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
-అల్లూరి వారసులుగా దీనిని అడ్డుకుంటాం

ఢిల్లీలోని ఏపీ భవన్‌లో నిన్న విలేకరులతో మాట్లాడిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు . కేంద్రం ఇష్టానుసారంగా తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. రైతు ఉద్యమం కొనసాగింపుపై జాతీయ కన్వెన్షన్ తీసుకున్న నిర్ణయాలను ఏపీలోనూ అమలు చేస్తామన్నారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే చూస్తూ ఊరుకోబోమని, అల్లూరి సీతారామరాజు వారసులుగా తెలుగుజాతి సహించబోదని హెచ్చరించారు. ఏపీలో రైతు ఉద్యమాన్ని ఉద్దేశించి దేశంలో చారిత్రాత్మక పోరాటం సాగుతున్నా మోదీ ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం దారుణమని వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. నూతన వ్యవసాయ విధానాలపై ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న రైతుల గోడు పట్టించుకోకుండా రైతులకోసమే వ్యవసాయ చట్టాలను తెచ్చామని మోడీ ప్రభత్వం చెప్పడం అత్యంత దుర్మార్గమన్నారు. గతంలో ఇన్ని రోజులుగా జరిగిన రైతు ఉద్యమం ప్రపంచంలోనే లేదని అన్నారు. రైతుల ఉద్యమాన్ని అణిచే ప్రయత్నాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల బీజేపీ విధానాలు బహిర్గతం అయ్యాయని పేర్కొన్నారు.

Related posts

యువతిని కొడుతూ నగ్నంగా ఊరేగించిన భర్త, అత్తమామలు

Ram Narayana

వ్యాక్సిన్ల కోసం జగన్ సర్కార్ కీలక నిర్ణయం…

Drukpadam

జడ్జి పురుషుడు అయినా, మహిళ అయినా సర్ అనాలి: గుజరాత్ హైకోర్టు సీజే 

Drukpadam

Leave a Comment