Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆ 40 అంతస్తుల ట్విన్ టవర్లను కూల్చేయండి: సుప్రీంకోర్టు సంచలన ఆదేశం!

ఆ 40 అంతస్తుల ట్విన్ టవర్లను కూల్చేయండి: సుప్రీంకోర్టు సంచలన ఆదేశం!
-నోయిడాలో ట్విన్ టవర్లను నిర్మించిన సూపర్ టెక్ సంస్థ
-నిబంధనలు పాటించలేదన్న సుప్రీంకోర్టు
-మూడు నెలల్లో నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశం
-ఈ ట్విన్ టవర్స్ లో 300 ప్లాట్స్
-ప్లాట్స్ యజమానులకు వారి ఇచ్చిన డబ్బులను తిరిగి 12 వడ్డీతో చెల్లించాలి

ఉత్తరప్రదేశ్ లోని నోయిడా లో నిర్మించిన ట్విన్ టవర్స్ ను మూడు నెలల్లో కూల్చి వేయాలని సుప్రీం చేశిన ఆదేశాలు సంచలనంగా మారాయి. అయితే ఈ టవర్ల విషయంలో ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ హైకోర్టు 2014 లో తీర్పు ఇచ్చింది. దీనిపై ఈ టవర్లను నిర్మించిన సూపర్ టెక్ సంస్థ సుప్రీం ను ఆశ్రయించింది. దాని నిర్మాణంలో లోపాలు ఉన్నాయని ,అంతే కాకుండా వాటి మధ్య దూరం కూడా చాల తక్కువగా ఉందని పేర్కొన్నది . అసలు దీనికి పర్మిషన్ ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని నోయిడా నగర పాలకసంస్థను ఆదేశించింది.

ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్లను కూల్చివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ టవర్స్ లో 900కు పైగా ఫ్లాట్స్ ఉన్నాయి. 2014 ఏప్రిల్ లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము సమర్థిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది.

ఈ టవర్ల నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఉందని ధర్మాసనం పేర్కొంది. మూడు నెలల్లోగా కూల్చివేతలను పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ టవర్లను సూపర్ టెక్ సంస్థ నిర్మించింది. కూల్చివేతలకు అయ్యే ఖర్చును కూడా సూపర్ టెక్ సంస్థ నుంచే వసూలు చేయాలని ఆదేశించింది. ఇందులో ప్లాట్లు కొన్నవారికి 12 శాతం వడ్డీతో నగదును తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణంలో ప్రమాణాలను పాటించలేదని, నిబంధనలను కూడా ఉల్లంఘించారని కోర్టు తెలిపింది. రెండు టవర్ల మధ్య ఉండాల్సిన గ్యాప్ లేదని చెప్పింది. టవర్లలో నివసించే వారి రక్షణ తమకు ముఖ్యమని స్పష్టం చేసింది.

Related posts

ప్రేయసి కోసం పాకిస్థాన్ వెళ్లి, చిక్కుల్లోపడి… ఎట్టకేలకు తిరిగొస్తున్న తెలుగు టెక్కీ

Drukpadam

సిపిఐ …కాంగ్రెస్ కలయిక కాకతాళీయమా ? కావాలనా…??

Drukpadam

లండన్ పర్యటనకు ఏపీ సీఎం జగన్ దంపతులు..

Ram Narayana

Leave a Comment