నల్ల దుస్తులతో వెళ్లి ఈసీని కలిసిన పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీ
కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిశారు. ‘సర్’ బాధితులు, టీఎంసీ బృందంతో కలిసి ఈసీతో భేటీ అయిన ఆమె, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు నిరసనగా నల్ల దుస్తులు ధరించారు. ఇదే అంశంపై ఆమె ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించి, రాష్ట్రంలో అమలవుతున్న SIRను సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో భారత ఎన్నికల సంఘం, పశ్చిమ బెంగాల్ సీఈఓలను ప్రతివాదులుగా చేర్చారు. జనవరి 28న పిటిషన్ దాఖలైంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: