Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైఎస్ అంటే అభిమానమే.. కానీ రాలేను: అసదుద్దీన్ ఒవైసీ!

వైఎస్ అంటే అభిమానమే.. కానీ రాలేను: అసదుద్దీన్ ఒవైసీ
వైఎస్ సంస్మరణ సభకు 300 మందికి ఆహ్వానాలు
ఆహ్వానాలు వెళ్లిన వారిలో చిరంజీవి, గద్దర్
విజయమ్మ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించిన ఒవైసీ

మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సంస్మరణ సభను హైదరాబాదులో రేపు సాయంకాలం నిర్వహించనున్నారు. ఈ సభ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఈ సభకు రావాలని ఆహ్వానిస్తూ 300 మందికి వైఎస్ భార్య విజయమ్మ ఆహ్వానాలు పంపారు.

ఇందులో భాగంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి కూడా ఆహ్వానం పంపారు. అయితే, విజయమ్మ ఆహ్వానాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. వైఎస్ అంటే తనకు అభిమానం ఉందని… అయితే, సభకు మాత్రం రాలేనని ఆయన సందేశం పంపినట్టు చెపుతున్నారు.

ఇక సభకు రాజకీయ నాయకులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా విజయమ్మ ఆహ్వానం పంపారు. వీరిలో ప్రజాకవి గద్దర్, సినీ నటులు చిరంజీవి, నాగార్జున, సూపర్ స్టార్ కృష్ణ, నిర్మాత దిల్ రాజు, రిటైర్ట్ జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, డి.శ్రీనివాస్, సునీతా లక్ష్మారెడ్డి, దానం నాగేందర్, కోమటిరెడ్డి బ్రదర్స్, జానారెడ్డి, దామోదర రాజనరసింహ, డీకే అరుణ, జితేందర్ తదితరులు ఉన్నారు.

 

వైయస్ విజయమ్మ సమావేశంపై కాంగ్రెస్ స్పందన
తెలంగాణలో కొత్త నాటకాలకువైయస్ విజయమ్మ తెరతీశారన్న జగ్గారెడ్డి
రాజశేఖరరెడ్డితో మాకున్న అనుబంధం వేరు
షర్మిల విషయంలో మాకు అభ్యంతరాలు లేవు
తెలంగాణకు విజయమ్మ ఏమవుతారు?

ఏపీ సీఎం జగన్ తల్లి విజయమ్మపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విజయమ్మ సరికొత్త నాటకాలకు తెరలేపుతున్నారని ఆయన ఆరోపించారు. వైయస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో కొడుకు జగన్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టి, బీజేపీతో కలిసి నడుస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కూతురు షర్మిలతో కలిసి ఆమె రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

వైయస్ రాజశేఖరరెడ్డితో తమకున్న అనుబంధం వేరని… ఇదే సమయంలో రాజకీయాలు కూడా వేరని ఆయన అన్నారు. షర్మిల తెలంగాణ కోడలేనని… ఈ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని… అయితే, తెలంగాణకు విజయమ్మ ఏమవుతారని ప్రశ్నించారు. విజయమ్మ రాజకీయాలు ఇక్కడ నడవవని అన్నారు. తెలంగాణలో గంజాయి మత్తులో ఉన్న యువతను బీజేపీ, ఎంఐఎం మత రాజకీయాలకు వాడుకుంటున్నాయని మండిపడ్డారు.

 

 

Related posts

బీజేపీ, జనసేన పొత్తు సంకేతాలు బలంగా వినిపించాలి: పార్టీ నేతలకు పురందేశ్వరి సూచన

Ram Narayana

తెలుగు తల్లి, తెలంగాణ బిడ్డ అంటూ షర్మిలకు గద్దర్ ప్రశంసలు..!

Drukpadam

రాహుల్ తో కలిసి నడిచిన మహాత్మాగాంధీ ముని మనవడు!

Drukpadam

Leave a Comment