Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పెసలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి: మాదినేని రమేష్

పెసలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి: మాదినేని రమేష్

తెలంగాణ రైతాంగ సాయుధపోరాట వారోత్సవాలు జయప్రదం చేయాలి

తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ

వానాకాలం సీజన్లో పండిన పెసలు కొనుగోలు కు మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది, భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధపోరాట వారోత్సవాలు సెప్టెంబర్ 10నుంచి సెప్టెంబర్ 17 వరకు గ్రామాల్లో జరిగే సభలో రైతులు పాల్గొన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేసింది శుక్రవారం ఖమ్మం సుందరయ్య భవన్ లో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పోరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 4 వ తేదీ నుంచి గ్రామాల్లో విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు, హర్యానా ప్రభుత్వం రైతులపై లాఠీ చార్జి జరిపి రైతుల మరణాలు కు కారణం అయింది అని అన్నారు , తెలంగాణ లో జరిగిన భూమి భుక్తి విముక్తి పోరాటం ను పాలకవర్గం వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తెలంగాణ రైతాంగ సాయుధపోరాట వారోత్సవాలు ను తెలంగాణ రైతాంగ సాయుధపోరాట యోధులు గ్రామాల్లో విస్తృతం గా నిర్వహించాలని పిలుపునిచ్చారు జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా పెసలు కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు, అరకొరగా వానాకాలం సీజన్లో పండిన పెసలు రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కు అమ్ముకోలేక సగం ధరకే పెసలు క్వింటాళ్ల కు మూడు నుంచి ఐదు వేల రూపాయలు కు విక్రయం చేస్తున్నారు అని కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు, సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాయల వెంకటేశ్వరరావు, కట్టా గాంధీ, జిల్లా కమిటీ సభ్యులు చింతనిప్పు చలపతిరావు, రావుల రాజా బాబు, సనమ్మతరావు , బిక్కసాని గంగాధర్,తూళ్ళూరి నాగేశ్వరావు, గుంటుపల్లి వెంకటయ్య, వనమా కృష్ణ, బల్లి వీరయ్య, కొల్లేటి ఉంపేదర్, రమేష్, రవి, మధు, నల్లమోతు మెహన్ రావు తదితరులు పాల్గొన్నారు

Related posts

కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ లో చేరుతున్నారా ….?

Drukpadam

తుమ్మల ..రేగా సమావేశం ఆంతర్యం ఏమిటి ?

Drukpadam

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ప్రశాంత్ కిశోర్?

Drukpadam

Leave a Comment