Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ లో వైయస్ సంస్మరణ సభ చిచ్చు … కోమటిరెడ్డి వెళ్లడంపై భగ్గుభగ్గు!

కాంగ్రెస్ లో వైయస్ సంస్మరణ సభ చిచ్చు … కోమటిరెడ్డి వెళ్లడంపై భగ్గుభగ్గు
-వెన్నుపోటు పొడవద్దుని కోమటిరెడ్డిపై మధుయాష్కీ ఫైర్
-విజయమ్మ నిర్వహించిన సమ్మేళనంకు వెళ్లడాన్ని తప్పుబట్టిన మధుయాష్కీ
-విజయమ్మ వ్యాఖ్యలను కోమటిరెడ్డి సమర్థిస్తారా? అని ప్రశ్న
-సీతక్క చంద్రబాబు కు రాఖీ కట్టడాన్ని సమర్థించిన మధు యాష్కీ
-సీతక్కపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్న మధు యాష్కీ
-మాజీ ఎంపీ కేవీపీ సభ కు వెళ్లడంపై మాట్లాడని కాంగ్రెస్ నాయకులు
-కాంగ్రెస్ ముఖ్యమంత్రి సభకు వెళ్లవద్దని చెప్పడం తప్పన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి
-పార్టీ లకు అతీతంగా ఎవరు చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లడం పరామర్శించడం సంప్రదాయమన్న కోమటి రెడ్డి
-సంతాప సభల్లో పాల్గొన్న సందర్భాలను గుర్తు చేసిన కోమటిరెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి చని పోయి 12 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన స్మరించుకునేందుకు ఆయన సతీమణి విజయమ్మ హైద్రాబాద్ లో ఏర్పాటు చేసిన సభ తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చుకు దారితీసింది. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి , మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్ రావు హాజరైయ్యారు . తెలంగాణ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు ,భవనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరు కావడం కాంగ్రెస్ లో కలహానికి దారితీసింది .కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఆ సభకు హాజరు కావద్దని టీపీసీసీ ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా కోమటి రెడ్డి హాజరు కావడాన్ని తప్పు పట్టింది. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, కోమటి రెడ్డి చర్యలపై మండి పడ్డారు . కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటి రెడ్డి వెళ్లి పోవాలనుకుంటే వెళ్లి పోవచ్చునని అన్నారు.

అయితే కాంగ్రెస్ నిర్ణయాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పు పట్టారు. కాంగ్రెస్ కు చెందిన ముఖ్యమంత్రి ,పదవిలో ఉండగానే మరణించారని అలంటి మహా నేత సభకు వెళ్లడం కాంగ్రెస్ పార్టీ కనీస భాద్యత అని అన్నారు. పీసీసీ వైయస్ సభకు వెళ్లవద్దని చెప్పిన విషయం తనకు తెలియదని తాను విజమ్మ ఫోన్ చేసి అడిగినప్పుడే సంస్మరణ సభకు వస్తానని మాట ఇచ్చానని అన్నారు. అయిన పీసీసీ కూడా సభ కు వెళ్లవద్దని చెప్పడం సరికాదని అన్నారు. ఆయన కాంగ్రెస్ సీఎం గానే చనిపోయారని గుర్తు చేశారు. పైగా సీతక్క వెళ్లి చంద్రబాబు కు రాఖీ కడితే లేని తప్పు వైసభకు వెళ్ళితే వచ్చిందంటే ఆశ్చర్యం వేస్తుందని అన్నారు.

కోమటిరెడ్డి ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియగాంధీ కారణమని చెప్పారు. పార్టీ నిర్ణయాన్ని కాదని సమ్మేళనంకు వెళ్లడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే పోవచ్చని… కానీ, పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేయవద్దని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా విజయమ్మ చేసిన వ్యాఖ్యలను కోమటిరెడ్డి సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కపై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. సంస్కారం లేని వాళ్లే ఇలా మాట్లాడతారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ ముఖ్యనాయకుడు కేవీపీ రామచందర్ రావు సభకు హాజరైన ఏపీ కాంగ్రెస్ నేతలు ఎవరు అభ్యంతర పెట్టక పోవడం గమనార్హం .

Related posts

తెలుగు తల్లి, తెలంగాణ బిడ్డ అంటూ షర్మిలకు గద్దర్ ప్రశంసలు..!

Drukpadam

దేశవ్యాపితంగా కాంగ్రెస్ కవాత్…తెలంగాణాలో రేవంత్ ,భట్టి పాదయాత్రలు!

Drukpadam

కేజ్రీవాల్ రోడ్ షో లో ‘మోదీ, మోదీ’ అంటూ నినాదాలు!

Drukpadam

Leave a Comment