Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

17న గజ్వేల్‌లో కాంగ్రెస్ దండోరా సభ…

17న గజ్వేల్‌లో కాంగ్రెస్ దండోరా సభ
-గజ్వేల్ సభ కంటే ముందు కరీంనగర్‌లో సభ పెట్టే యోచన
-నిన్న గాంధీభవన్‌లో సమావేశమైన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ
-కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది … రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడుగా నియమించినతరువాత కాంగ్రెస్ కు దూరమైనా వారు , కాడి కింద పడేసిన వారు రంగంలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ లో అంతర్గత తగాదాలను అధిగమించి ముందుకు సాగుతున్నారు. అయితే కోమటి రెడ్డి బ్రదర్స్ కొంత కొరకరాని కొయ్యగా తయారు అయ్యారు. వారితో రేవంత్ రెడ్డి మాట్లాడేందుకు జరిపిన ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు . అయినప్పటికీ రేవంత్ తన ఎజండా తో టీఆర్ యస్ ప్రభుత్వంపై వాగ్బాణాలు ఎక్కు పెడుతున్నారు.

రాష్ట్రంలో దళిత బందు అమలు పై సందేహాలు వ్యక్తం చేస్తూనే మరో పక్క దళితులతో పాటు గిరిజనులకు ఈ పథకం వర్తింపచేయాలని డిమాండ్ చేస్తుంది .అందుకోసం ప్రజలను చైతన్యం చేసేందుకు సభలు పెడుతుంది. ఇప్పటికే రెండు చోట్ల సభలు పెట్టిన కాంగ్రెస్ సీఎం సొంత నియోజకర్గం గజ్వేల్ లో సభకు నిర్ణయించింది. అక్కడ జరగనున్న సభకు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభగా నామకరణం చేసింది.

ఈ నెల 17న గజ్వేల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నిన్న హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ విలేకరుల సమావేశంలో వివరించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలపై సమావేశంలో సమీక్ష నిర్వహించినట్టు తెలిపారు. గజ్వేల్ సభ కంటే ముందు కరీంనగర్‌లో ఓ సభను పెట్టాలన్న ఆలోచన కూడా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై మహేశ్ కుమార్ విమర్శలు చేశారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన వెంటనే హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడిందన్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనన్న దానికి ఇది నిదర్శనమన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక భయం కేసీఆర్‌లో కనిపిస్తోందని మహేశ్‌కుమార్ అన్నారు.

Related posts

కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై …!

Drukpadam

పార్టీలు అన్ని ఏకమైనా వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది: మంత్రి పెద్దిరెడ్డి

Drukpadam

బెంగాల్‌ ప్రచారపర్వంలోకి జయాబచ్చన్…టీఎంసీ కి మద్దతు

Drukpadam

Leave a Comment