Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మా సహనాన్ని పరీక్షిస్తున్నారు: కేంద్ర ప్రభుత్వంపై సీజేఐ ఎన్వీ రమణ ఆగ్రహం!

మా సహనాన్ని పరీక్షిస్తున్నారు: కేంద్ర ప్రభుత్వంపై సీజేఐ ఎన్వీ రమణ ఆగ్రహం!
-ట్రైబ్యునళ్లకు సంబంధించిన చట్టంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
-కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పులంటే గౌరవం లేదన్న సీజేఐ
-కోర్టు ధిక్కరణ చర్యలను చేపట్టమంటారా? అని ప్రశ్న

సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ ఇస్తున్న పలు తీర్పులు ఆలోచింప జేసేవిగా ఉంటున్నాయి. ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇస్తున్నతీర్పులు చేస్తున్న వ్యాఖ్యానాలు అద్భుతం అనే మాటలే వినిపిస్తున్నాయి. అనేక కేసులపై ఆయన నిర్మొహమాటంగా మాట్లాడుతున్నారు. చురకలు అంటిస్తున్నారు. జడ్జిల నియామకం దగ్గరనుంచి ఆయన న్యాయవ్యవస్థకు చేస్తున్న కృషి అమేఘమనే చెప్పాలని పలువురు న్యాయ నిపుణులు అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం ప్రకారం నడుచుకోనప్పుడు కూడా వారి బాడీతలను గుర్తు చేస్తున్నారు. ఇటీవల ట్రిబునళ్లు సంబంధించి కేంద్రప్రభుత్వం చేసిన కొత్త చట్టంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం . కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్ తీర్పులంటే గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సుప్రీం కోర్టు రద్దు చేసిన చట్టం లాంటిదాన్నే తిరిగి ప్రవేశ పెట్టడంపై సిజెఐ అసహనం వ్యక్తం చేశారు.

ట్రైబ్యునళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన కొత్త చట్టంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పులంటే గౌరవం లేదని అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం… గతంలో తాము రద్దు చేసిన చట్టం వంటిదేనని చెప్పారు. అలాంటి చట్టాన్నే మరొకదాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

ఇప్పుడు తమ ముందు మూడు మార్గాలు ఉన్నాయని.. ట్రైబ్యునళ్లను రద్దు చేయడం లేదా కేంద్రం తెచ్చిన కొత్త చట్టాన్ని రద్దు చేయడం లేదా కేంద్రంపై కోర్టు ధిక్కరణ చర్యలను చేపట్టడం అని చెప్పారు. ట్రైబ్యునళ్లలో ఖాళీలను భర్తీ చేయకపోవడంపై కూడా సీజేఐ మండిపడ్డారు. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నామని… ఈలోగా తమకు సమాధానం చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించారు.

Related posts

కాంగ్రెస్ నేత పొంగులేటితో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ

Drukpadam

షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఏపీ సీఎం జగన్….! 

Ram Narayana

తమకు సహకరించిన వారి పేర్ల జాబితాను తాలిబన్లకు ఇచ్చిన అమెరికా సైన్యం: మండిపడుతున్న యూఎస్ నేతలు!

Drukpadam

Leave a Comment