Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం లో కాంగ్రెస్ కు ఝలక్ ఇవ్వనున్న ఇద్దరు కార్పొరేటర్లు!

ఖమ్మం లో కాంగ్రెస్ కు ఝలక్ ఇవ్వనున్న ఇద్దరు కార్పొరేటర్లు!
-ఇప్పటికే టీఆర్ యస్ తో మంతనాలు పూర్తీ అయినట్లు సమాచారం
– జంప్ అయ్యేవారిలో ఖమ్మం కు ఆ పక్కన ఒకరు ఈ పక్కన ఒకరు
-తమ డివిజన్ల అభివృద్ధి మంత్రి అజయ్ తోనే సాధ్యమనే విశ్వాసం
-అదే బాటలో మరికొందరు పయనించే అవకాశం…?

ఖమ్మం నగర కార్పొరేషన్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలుపొందిన 10 మంది కార్పొరేటర్లలో ఇద్దరు కార్పొరేటర్లు అధికార టీఆర్ యస్ చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని విశ్వసనీయసమాచారం. ఈ మేరకు వారు టీఆర్ యస్ తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది.

ఖమ్మం కార్పొరేషన్ లో టీఆర్ యస్ మేయర్ గా ఉండటంతో పాటు అధికార పార్టీ అండదండలు కావాలని కోరుకునే ఆ కార్పొరేటర్లు టీఆర్ యస్ లో చేరేందుకు సిద్ధపడినట్లు తెలుస్తుంది. అయితే మిగతా వారిలో కూడా మరో ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్లు టీఆర్ యస్ గూటికి చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ మంత్రి గా ఉండటంతో పాటు ఖమ్మం అభివృద్ధిపై ద్రుష్టి పెట్టడంతో ఖమ్మం రూపు రేఖలు మారిపోయాయి. ఒకప్పటి ఖమ్మం ఇప్పటి ఖమ్మం కు బేరీజు వేసుకొని కొందరు టీఆర్ యస్ లో చేరడమే మంచిదనే అభిప్రాయానికి వస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండ పాలక పార్టీ లో ఉంటె తమ డివిజన్లను అభివృద్ధి చేసుకోవచ్చినని భావిస్తున్నారు. తమను గెలిపించిన ప్రజలకు మేలు చేయాలంటే మంత్రి అండదండలు అవసరమనే అభిప్రాయం తో వారు ఉన్నారు.

కాంగ్రెస్ కు ఖమ్మం నగరంలో దిక్కు దివాణం లేకపోవడం కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తుంది. ఏదైనా సమస్య వస్తే ఎవరికీ చెప్పుకోవాలో తెలియని అయోమయం నెలకొనడం కాంగ్రెస్ కు పెద్ద మైనస్ గా ఉంది.ఖమ్మం నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ కి ఇంచార్జి కూడా లేరు . కార్పొరేషన్ ఎన్నికల్లో కొంతవరకు అండదండగా ఉన్న భట్టి తరువాత కాలంలో పట్టించుకున్న దాఖలాలు లేవనే అభిప్రాయాలు ఉన్నాయి. 4 లక్షల జనాభా ఉన్న ఖమ్మం నగరంలో కాంగ్రెస్ కార్యకర్తలు అనేక ఇబ్బందులను ఎదురుకొంటున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 10 డివిజన్లలో విజయం సాధించారు. మరో 10 డివిజన్లలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ కు ఇప్పటికి మంచి ఓటింగ్ ఉన్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే నాయకుడు కరువైయ్యాడు . అందువల్ల ఖమ్మం కాంగ్రెస్ లో చురుకైన నాయకుడు కావాలనే కార్యకర్తల కోరికను ఎవరు నెరవేర్చడం లేదు . అటు పీసీసీ గాని ఇటు సీఎల్పీ గాని పట్టించుకున్న పాపాన పోవడంలేదు . ఎంత సేపటికి ఎన్నికల రాజకీయాలు తప్ప కార్యకర్తల కష్టాలను తీర్చే నాయకుడు లేకపోవడం ప్రతికూలంగా మారింది. అందువల్ల కాంగ్రెస్ లో ఉంటె లాభం లేదనుకున్న కొందరు కార్పొరేటర్లు మంత్రి పువ్వాడ అజయ్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఆ పార్టీ లో చేరేందుకు సిద్ధపడినట్లు తెలుస్తుంది.

పువ్వాడ నిరంతరం కార్యకర్తలకు అండగా ఉండటమే కాకా అభివృద్ధిపై తనదైన ముద్ర వేస్తున్నారు. ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పార్కుల ఏర్పాటు , పార్కులలో జిమ్ములు వాకింగ్ ట్రాకులు , రోడ్ల వెడల్పు , డివైడర్ల ఏర్పాటు ,సెంట్రల్ లైటింగ్, మరుగు దొడ్లు , ప్రముఖులు విగ్రహాల ఏర్పాటు లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. లకారం లేక్ తీర్చి దిద్దటంతో పాటు , పక్కనే మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ గా మార్చడం పలువురి ప్రసంశలు అందుకున్నది .

 

Related posts

కశ్మీర్ లో ఆర్టికల్ 370ని మళ్లీ తెచ్చుకోలేం.. అది ఎవరి వల్ల కాదు:ఆజాద్

Drukpadam

భూకబ్జా నిరూపిస్తే రాజీనామా చేస్తా …. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

Drukpadam

నేను నిప్పును ఏతప్పూ చేయలేదు … పదవికన్నా ఆత్మగౌరమే ముఖ్యం :ఈటెల

Drukpadam

Leave a Comment