Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటు చట్ట విరుద్ధం: ఢిల్లీలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం!

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటు చట్ట విరుద్ధం: ఢిల్లీలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం!
-మూడు రోజుల క్రితం మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు
-పూర్తి స్థాయి ప్రభుత్వ కూర్పుపై దృష్టి
-తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటు ఆమోదయోగ్యం కాదన్న ఎంబసీ

తెలిబన్లు ఆఫ్ఘన్ లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలనా కూడా సాగిస్తున్నారు. ప్రపంచంలోని చాల దేశాలు తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు సిద్ధంగా లేవు . మనదేశం కూడా వేచి చూసే ధోరణిలో ఉంది. ఆఫ్ఘన్ నుంచి అమెరికా సైన్యాలు వెళ్ళిపోయినా తరువాత పంజ్ షేర్ లాంటి ప్రాంతాలలో కొంత తిరుగుబాటు వచ్చినప్పటికీ వారుకూడా చేతులెత్తేశారు. దీంతో మొత్తం ఆఫ్ఘన్ దేశం తాలిబన్ల వెలుబడిలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఏర్పడింది. ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదని అందువల్ల దాన్ని గుర్తించబోమని పంజ్ షేర్ ప్రాంత తిరుగుబాటు దార్లు కూడా ప్రకటించారు. వారికీ ఇంకా ఎక్కడో పాశ్చత్య సైన్యాలు వచ్చి తమను రక్షిస్తాయని ఆశ ఉంది. బ్రిటన్ ప్రధాని సైతం తాలిబన్ పాలనా కేసుల చూడాలి కదా అని అన్నారు. వారు మారిఉండవచ్చు అని కూడా వ్యాఖ్యానించారు .రష్యా , కూడా ఆచితూచి ఆడుగులు వేస్తుంది.చైనా , పాకిస్తాన్ తాలిబాన్లకు గట్టి మద్దతుదారులుగా నిలిచాయి. మనదేశంలో ఉన్న ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తిచడం లేదని అది ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వం కాదని ప్రకటించడం గమనార్హం .

గత నెలలో ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు మూడు రోజుల క్రితం మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. త్వరలోనే పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కొత్త ప్రభుత్వ ఏర్పాటు వేడుకకు హాజరు కావాల్సిందిగా పలు దేశాలను ఆహ్వానించనున్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఆఫ్ఘనిస్థాన్ రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. తాలిబన్ల నేతృత్వంలో ఆఫ్ఘనిస్థాన్‌లో ఏర్పడిన ప్రభుత్వం చట్టబద్ధమైనది కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ శాఖ’ పేర్కొంది. తాలిబన్లు కేబినెట్‌ను ఏర్పాటు చేయడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు ఇది పూర్తిగా వ్యతిరేకమని ఆందోళన వ్యక్తం చేసింది.

కాగా, తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పరారైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ప్రకటన ఆయన ప్రభుత్వ అభిప్రాయంగానే చెబుతున్నారు.

Related posts

ముందస్తు ఎన్నికలకోసమే కేసీఆర్ హడావుడి చేస్తున్నారా ?

Drukpadam

‘పప్పు’ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందన…

Drukpadam

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ యస్ ఎన్నికల ఇంచార్జిలుగా హేమ హేమీలకు భాద్యతలు !

Drukpadam

Leave a Comment