Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బైడెన్‌పై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. ఒక్క క్షణం కూడా నిలవడేమో అంటూ..

బైడెన్‌పై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. ఒక్క క్షణం కూడా నిలవడేమో అంటూ..

-బాక్సింగ్ ప్రత్యర్థిగా ఎవరిని ఎంచుకుంటారని ప్రశ్న
-అధ్యక్షుడు బైడెన్ పేరు చెప్పిన ట్రంప్
-సులభంగా గెలిచేస్తా అంటూ ధీమా

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. బైడెన్ తన ముందు ఒక్క క్షణం కూడా నిలవలేడని చెప్పారు. తాజాగా జరగనున్న ఓ బ్యాక్సింగ్ మ్యాచ్‌కి ట్రంప్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో జరిగిన ఓ మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడారు.‘మీరంటూ ఓ డ్రీమ్ బాక్సింగ్ మ్యాచ్‌లో పాల్గొంటే. అందులో మీ ప్రత్యర్థిగా మీరు ఎవరిని ఎంచుకుంటారు’ అని ఒక రిపోర్టర్ అడిగారు. అందుకు ట్రంప్ సమాధానం ఇస్తూ తన డ్రీమ్ బ్యాక్సింగ్ మ్యాచ్‌లో ప్రత్యర్థిగా జో బైడెన్‌ను ఎంచుకుంటానని చెప్పారు.

బాక్సింగ్ రింగ్‌లో బైడెన్ తన ముందు ఒక్క క్షణం కూడా నిలవలేడని, మ్యాచ్ మొదలయిన క్షణాల్లోనే బైడెన్‌ను మట్టికరిపిస్తానని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఈ వాక్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ట్రంప్, బైడెన్ అభిమానులు వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నరు.

Related posts

ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్… వైరస్ లక్షణాలు ఇవే!

Drukpadam

వ్యాక్సిన్ల కోసం రాష్ట్రాలు కొట్టుకునే దారుణ పరిస్థితులు తలెత్తాయి: కేజ్రీవాల్…

Drukpadam

కేసీఆర్ పుట్టకుంటే తెలంగాణ ఉద్యమం పుట్టేది కాదు: కేటీఆర్

Drukpadam

Leave a Comment