Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బిగ్ బాస్ ఓ బ్రోతల్‌ స్వర్గం-నారాయణ కలకలం : ముద్దులు-డేటింగ్ : జగన్ మంచి నిర్ణయం..!!

బిగ్‌బాస్‌ కార్యక్రమం ఓ బ్రోతల్‌ స్వర్గం :షో నిలిపివేయాల్సిందే: సిపిఐ నారాయణ
-యువతను పెడదోవ పట్టించేందుకు ముద్దులు ,డేటింగ్ లు
-రెడ్‌లైట్‌ సంస్కృతిలాంటిదే దీనివల్ల సమాజానికి చాల నష్టం
-వేల కోట్ల రూపాయల వ్యాపారం
-ఒకే చోట 106 రోజులు బందించి యువతకు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు
-దీనిపై పోలీస్ స్టేషన్ కు వెళ్ళాను ,న్యాయస్థానికి వెళ్లిన సహకారం లేదు
-ఆన్ లైన్ టిక్కెట్ల విషయంలో జగన్ విధానం సరైనదే

 

సంచలన వ్యాఖ్యలు చేయటంలో ముందుండే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి అటువంటి వ్యాఖ్యలు చేసారు. బిగ్ బాస్ పైన ప్రతీ సందర్భంలోనూ విరుచుకుపడే నారాయణ ఈ సారి తీవ్ర వ్యాఖ్యలతో కలకలం రేపారు. కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ నిర్వహణ నున కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాలు నిలిపివేయాలని నారాయణ డిమాండ్ చేసారు. అదే విధంగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఈ కార్యక్రమం ద్వారా యువతను పెడదోవ లోకి నెడుతున్నారని..ఈ పేరుతో వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

బిగ్ బాస్ హౌస్ పేరుతో ఒకే చోట 40 రోజుల పాటు యువతీ – యువకులను బంధించటం ద్వారా ఏం సందేశం ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక, ఇప్పుడు ఇదే అంశంలో తీవ్ర వ్యాఖ్యలు చేసారు. బిగ్‌బాస్‌ కార్యక్రమం ఓ బ్రోతల్‌ స్వర్గమమంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. రెడ్‌లైట్‌ సంస్కృతిలాంటిదంటూ నారాయణ కలకలం రేపారు. ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని మరోసారి కోర్టుకు వెళతానని వెల్లడించారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో యువతీయువకులను 105 రోజులు ఒకే గదిలో పెడుతున్నారన్నారు. లోపల ముద్దులు పెట్టుకుంటున్నారంటూ.. డేటింగ్‌ చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు.

బిగ్ బాస్ షో నిలిపివేయాల్సిందే

ఇది సాంస్కృతి క దోపిడీ అని ఆరోపించారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి ఏ సందేశం ఇస్తున్నారని నిలదీశారు. ఆ కార్యక్రమాన్ని 24 గంటలూ ప్రత్యక్ష ప్రసారం చేయగలరా అంటూ నారాయణ సవాల్‌ చేసారు. కొద్ది రోజుల క్రితం నారాయణ ఇదే అంశం పైన తాను పోలీసు స్టేషన్ కు వెళ్లానని.. న్యాయస్థానికి వెళ్లినా తనకు న్యాయ వ్యవస్థ నుంచి సహకారం అందలేదని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులోనే కాకుండా.. జాతీయ స్థాయిలో..అనేక ప్రాంతీయ భాషల్లోనూ ప్రసారం చేస్తున్నారు. వీటన్నింటినీ నిలిపివేయాలనేది నారాయణ డిమాండ్ .

ఆన్ లైన్ టిక్కెట్ల విధానం సరైనదే

ఈ సీజన్ గురించే కాకుండా.. గతంలో నాలుగో సీజన్ ప్రసార సమయంలోనూ నారాయణ బిగ్ బాస్ షో పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ సారి మరింత డోసు పెంచి ఇటువంటి వ్యాఖ్యలతో కలకలం రేపారు. ఇక, ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఆన్ లైన్ సినిమా టిక్కెట్ల విషయం పైన నారాయణ స్పందించారు. సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం చెప్పడం మంచి నిర్ణయమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆన్‌లైన్‌లో టిక్కెట్ల బుకింగ్‌ను అమ లు చేయాలని ఆయన సూచించారు.

అమిత్ షా అడుగు పెట్టాలంటే

తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికారికంగా గుర్తించిన తర్వాతే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాష్ట్రంలో అడుగుపెట్టాలని నారాయణ డిమాండ్‌ చేశారు. ఎంఐఎం బ్లాక్‌మెయిలింగ్‌ పార్టీ అని, ఆ పార్టీకి సీఎం కేసీఆర్‌ లొంగిపోయారని దుయ్యబట్టారు. ఈ నెల 17న విలీన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపకపోతే టీఆర్‌ఎస్‌ నేతలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని నారాయణ అన్నారు. పెగాసస్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే పార్లమెంటు పరువుపోతుందని నారాయణ వ్యాఖ్యానించారు.

బిగ్ బాస్ పై నారాయణ వ్యాఖ్యల ప్రభావం ఉంటుందా

అదే జరిగితే ప్రధాని మోదీ పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని అంటూ వ్యాఖ్యానించారు. ఇలా.. వరుసగా నారాయణ బిగ్ బాస్ షో ను టార్గెట్ చేస్తూ చేస్తున్న తీవ్ర వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దీని పైన బిగ్ బాస్ షో నిర్వాహకుల నుంచి ఏమైనా రియాక్షన్ ఉంటుందా లేదా.. నారాయణ వ్యాఖ్యల పైన వారు స్పందిస్తార లేక వదిలేస్తారా అనేది వేచి చూడాల్సిందే. గతం కంటే తీవ్ర స్థాయిలో నారాయణ వ్యాఖ్యలు చేయటం తో ఇప్పుడు ఈ చర్చ కీలకంగా మారుతోంది.

Related posts

ఫోర్జరీ కేసులో అయ్యన్నపాత్రుడుకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!

Drukpadam

మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో దొరికిన డబ్బెంత?…ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?: కిషన్ రెడ్డి

Drukpadam

జూడాలతో ప్రభుత్వ చర్చలు విఫలం…

Drukpadam

Leave a Comment