ఆఫ్ఘన్ ఉగ్రవాదులకు అడ్డా కాబోదు ,కానివ్వం: తాలిబన్లు…
మీడియాకు తెలిపిన విదేశాంగ మంత్రి మొలావీ
ఉగ్రవాదులకు అడ్డాగా ఆఫ్ఘన్‌ను మారనివ్వం
అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాలు తలదూర్చాల్సిన అవసరం లేదు
మాదేశాన్ని ప్రజలను ఎలా బాగుచేసుకోవాలో మాకు తెలుసు
ఆఫ్ఘనిస్థాన్ అంతా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఆ దేశం కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతాయని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. దీనిపై తాలిబన్ ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి మొలావీ ఆమిర్ ఖాన్ ముత్తఖి స్పందిస్తూ.. అటువంటివేమీ జరగబోవని స్పష్టం చేశారు. తమ దేశాన్ని ఉగ్రశిబిరాలకు కేంద్రంగా మారనివ్వబోమని చెప్పారు. ఇది ఎట్టి పరిస్థిల్లోనూ ఉగ్రవాదులకు అద్దకాదని ,కనివ్వబోమని పేర్కొన్నారు.దేశాన్ని ఎలపరిపాలించుకోవాలి , దేశ ప్రయోజనాలను ఎలా కాపాడు కోవాలి , అనేది మాకు తెలుసునని ,ఇతరుల జోక్యం అవసరంలేదని ఆయన అన్నారు . ఆఫ్ఘన్ తాలిబన్ల పాలనపై అనేక సందేహాలు ఉన్నాయి. అక్కడ ఎన్నికలు జరగకుండానే తిరుగుబాటులో అధికారంలోకి వచ్చిన తాలిబన్లు మహిళల విషయంలో ఎలాఉంటారు . విద్య విషయం లో వారి విధానం ఏమిటి మహిళలను ఉద్యోగం చేయనిస్తారా ? లేదా ?వీరి విదేశాంగ విధానం ఏమిటి ? అనేది ప్రపంచ దేశాలు వేయికళ్లతో వెదురు చూస్తున్నాయి.
అలాగే, ఆఫ్ఘన్‌లో మైనారిటీలు, మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తారా? అన్న విషయాలనూ ఆయన తెలపలేదు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్నికలు నిర్వహిస్తారా? అన్న విషయంపై ఆయనను మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. తమ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాలు తలదూర్చాల్సిన అవసరం లేదని దాటవేశారు. కాగా, అల్‌ఖైదా వంటి ఉగ్ర సంస్థలతో సత్సంబంధాలు పెట్టుకోకూడదన్న విషయంపై అమెరికాతో చర్చల సందర్భంగా గత ఏడాది తాలిబన్లు ఒప్పందం చేసుకున్నారు. ఆఫ్ఘన్ ఎట్టి పరిస్థిల్లోనూ ఉగ్రవాదులకు అడ్డా కాబోదు ,కానివ్వం అని స్పష్ష్టం చేశారు. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరుపుతారా అనే మీడియా ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుండా మంత్రి దాటవేషరు. ఇతరుల జోక్యాన్ని అనుమతించబోమని అన్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తాలిబన్ ప్రభుత్వం ఎలాంటి పరిపాలన ఆడిస్తుందో చూద్దాం అని వ్యాఖ్యానించారు. తాలిబన్లు మారిపోయి ఉండవచ్చును కదా అనికూడా అయన అభిప్రాయం వ్యక్తం చేశారు.