Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆళ్ళ… షర్మిల వద్దకు జగన్ దూతగా వెళ్ళారా  …?

ఆళ్ళ… షర్మిల వద్దకు జగన్ దూతగా వెళ్ళారా  …?
-పార్టీ విషయంలో ఆలోచించాలని హితవు పలికారా …??
-వెనక్కి తగ్గేది లేదని చెప్పిన చెల్లెలు చెప్పారా…???
– రాజ్యసభ , లేదా కాబినెట్ లో చోటు కల్పించేలా మాట్లాడతానన్నారా …????
జగన్ , షర్మిల మధ్య రాజకీయాలు అలనాటి మహాభారతాన్ని తలపింప చేస్తున్నాయి …పాండవులు దృతరాష్టుడి వద్దకు శ్రీకృష్ణుడిని రాయబారం పంపారు….. మహాభారత యుద్దాన్ని నివారించేందుకు……. కనీసం ఐదు ఊళ్లు ఇవ్వమని అడిగారు….. అందుకు కౌరవులు అంగీకరించలేదు….కానీ నేటి భారతం వేరు…. అన్న అక్కడ యుద్ధం చేసేందుకు అనువు కాదేమో అంటున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న స్నేహ సంభందాలు దెబ్బతింటాయేమోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్న చెప్పాల్సింది చెప్పారు … ఇక చెల్లలు నిర్ణయం మీదనే ఆధారపడి ఉంది . .. ఏపీ సీఎం జగన్ వారించినా చెల్లవు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టాలనే గట్టి నిర్ణయంతో అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు , మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణరెడ్డి షర్మిలతో భేటీ అవ్వటం ప్రాధాన్యత సంతరించుకున్నది . బుధవారం ఆయన లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో షర్మిలతో సమావేశం అయ్యారు. ప్రస్తుతం ఆమె పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో చివరిసారిగా, అన్నమాటగా చెప్పేందుకే వచ్చారని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం . ఆయన ఏమి చెప్పి ఉంటారు , అందుకు ఆమె నుంచి వచ్చిన సమాధానం ఏమిటి అనేదానిపై రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. అసలు కేసీఆర్ కు లాభం చేకూర్చేందుకు జగన్ చెల్లెలు తో రాజకీయ పార్టీ పెట్టించబోతున్నారని కొన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం . నిజంగా జగన్ పార్టీ పెట్టమని చెల్లెలు షర్మిలకు సలహా ఇస్తే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి ని పంపేవారు కాదు. ఆళ్ళ ను జగన్ పంపారా? ఆయనే స్వయంగా వచ్చారా ? అనేసందేహాలు కూడా ఉన్నాయి. ఒకవేళ పంపి ఉంటె పార్టీ పెట్టె ఆలోచనలు విరమించుకోమని మరోసారి చెప్పటానికే అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఇదే అయితే జగన్ అండతో ఆయన ప్రోద్బలంతో పార్టీ పెడుతున్నారని అనే ప్రచారం అబద్దం అని తేలిపోతుంది. అప్పుడు బీజేపీ కోసమో , లేక కేసీఆర్ కోసమో పార్టీ పెడుతున్నారనే ప్రచారం తప్పు అవుతుంది . అయితే ఒకరి లాభం కోసం , మరొకరి మాట విని పార్టీ పెట్టేంత బలహీనులు కారు రాజన్న బిడ్డలు అనేది మరో వాదన . అన్నతో చెడి పోయిందా అంటే లేదు బిన్నాభి ప్రాయాలు ఉన్నాయి కానీ బేధాభిప్రాయాలు లేవని జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి చెప్పిన విషయం తెలిసిందే . రాజకీయాలలో ఎవరి అభిప్రాయాలూ వారికీ ఉంటాయి. ఒకే కుటుంభం ఒకే పార్టీలో ఉండాలనే రూల్ కూడా ఏమి లేదు. కానీ జగన్ మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు అన్నలేక పోయిన తాను ఉన్నానని తల్లి విజయమ్మతో కలిసి మొత్తం పార్టీని నడిపించారు షర్మిల . అలాంటి చెల్లలును జగన్ తాను అధికారంలోకి వచ్చిన తరువాత తన ప్రభుత్వంలో భాగం చేయాల్సి ఉండే ననే అభిప్రాయాలూ ఉన్నాయి. నిజంగా షర్మిల జగన్ ప్రభుత్వం లో ఉంటె ఆయనకు బలం కూడా అనేది పరిశీలకుల అభిప్రాయం . కానీ జగన్ మరోలా ఆలోచించి ఉంటాడని , ఆమెను భాగస్వామిని చేస్తే , కుటుంబం అంతా పదవులే అనే విమర్శలు వచ్చే ఆవకాశం ఉంటుందని అనుకోని ఉండవచ్చు .కానీ ఇప్పుడు రాజకీయాలలో నడుస్తున్న ట్రెండ్ అదే . తెలంగాణాలో కేసీఆర్ కాబినెట్ లో కుమారుడు, మేనల్లుడు, ఉన్నారు. మరో కుమారుడు, ఎంపీ గా , కుమార్తె ఎమ్మెల్సీగా ఉన్నారు. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో కుమారుడు మంత్రిగా పార్టీ ప్రధాన కార్యదర్శి గా ఉన్నారు. అందువల్ల కుటుంబం కాదు వారు అర్హుల కాదా ? సత్తా ఉందా లేదా ? అనేది చూడాలి . రాజకీయాలలోకి ఒక సారి ఎంటర్ అయినా తరువాత ఎవరైనా ఎదో ఒక పదవిని కోరుకుంటారు. అందుకు షర్మిల మినహాయింపు కాదు ఆమె మానహమాతృరాలే కదా ? . రాజకీయాల పట్ల ఆశక్తి ఉన్న తరువాత వారికీ తగిన ఆవకాశం ఇవ్వకపోతే పరిణామాలు మరోలా ఉంటాయనేది చరిత్ర చెబుతున్న సత్యం . పదవి ఇవ్వలేదనే కేసీఆర్ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని అది చివరకు రాష్ట్ర విభజనకు దారితీసింది . దీనిపై ఇప్పటికి చంద్రబాబుపై విమర్శలు ఉన్నాయి .
షర్మిల వద్దకు ఆళ్ళ రామకృష్ణరెడ్డి ఎలాంటి ప్రతిపాదనలతో వచ్చారు ? ఏమి మాట్లాడారు ? అనేది వారు చెపితేగానే తెలియదు. అయితే ఊహాగానాలు మాత్రం రకరకాలుగా ఉన్నాయి. పార్టీ పెట్టవద్దని చెప్పిన రాయబారి ఆళ్ళ ,అన్నకు చెప్పి ఏపీ నుంచి రాజ్యసభకు లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంచి పదవి ఇచ్చేలా మాట్లాడతానని ఉండవచ్చుననే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. అందుకు ఆమె సున్నితంగానే , ఆప్రతిపాదనలు తిరస్కరించినట్లు తెలుస్తుంది . తాను తెలంగాణాలో రాజన్న రాజ్యం తెచ్చేందుకే పార్టీ పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పి ఉండవచ్చునని పరిశీలకుల అభిప్రాయం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఆళ్ళ రాయబారం ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది . అన్న, చెల్లెలు అనుభందం ఎలా ఉంటుంది అనేది ఆశక్తిగా మారింది…

Related posts

శంకరం తండా వద్ద ఉద్రిక్తత… వైఎస్ షర్మిల అరెస్ట్!

Drukpadam

బొత్స‌, అంబ‌టి వ్యాఖ్య‌లు బాధాక‌రం: తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ!

Drukpadam

వైయస్సార్ పేరును జగన్ చెడగొడుతున్నారు: డీఎల్ రవీంద్రారెడ్డి

Drukpadam

Leave a Comment