Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సాయుధ పోరాటం చేసింది కమ్యూనిస్టులే: బీజేపీ కి తెలంగాణ విమోచన గురించి మాట్లాడే హక్కులేదు …కేటీఆర్!

సాయుధ పోరాటం చేసింది కమ్యూనిస్టులే: బీజేపీ కి తెలంగాణ విమోచన గురించి మాట్లాడే హక్కులేదు …కేటీఆర్!
-కాంగ్రెస్ సీనియర్ నేతలు గాడిదలైతే.. రేవంత్ రెడ్డి అడ్డగాడిదా?: కేటీఆర్
-రేవంత్ ది హడావుడే కానీ.. ఆయనకు అంత సీన్ లేదు
-షర్మిల, ప్రవీణ్ కుమార్ జాతీయ పార్టీలకు తొత్తులు

-అవసరమైతే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లపై దేశద్రోహం కేసులు పెడతాం: కేటీఆర్
-ముఖ్యమంత్రి గురించి నిరాధార ఆరోపణలు చేస్తున్నారు
-టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నా గురించి మాట్లాడుతున్నారు
-నా బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను రెడీ

 

రాష్ట్రమంత్రి ,టీఆర్ యస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ బీజేపీ కాంగ్రెస్ లతోపాటు , షర్మిల, ప్రవీణ్ కుమార్ లపై కూడా మొదటి సరిగా విరుచుపడ్డారు. బీజేపీ కి తెలంగాణ విమోచన గురించి మాట్లాడే హక్కులేదని స్పష్టం చేశారు. సాయుధపోరాట చరిత్ర కమ్యూనిస్టులదని అన్నారు. సాయుధపోరాటం గురించి క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తే అది కమ్యూనిస్టులకు మాత్రమే హక్కు ఉందని అన్నారు. పనిలో పనిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలను గాడిదలుగా పోల్చిన రేవంత్ ఆయన అడ్డగాడిద అని విరుచుకపడ్డారు. ఇక షర్మిల , ప్రవీణ్ కుమార్ లు జాతీయపార్టీలకు తొత్తులుగా మారారని ధ్వజమెత్తారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేటీఆర్ ను ప్రశంసించిన కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ను రేవంత్ గాడిద అన్న సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత ఆయన క్షమాపణ చెప్పారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గాడిదలైతే.. రేవంత్ రెడ్డి అడ్డగాడిదా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి దూకుడు రియలెస్టేట్ వెంచర్ వంటిదని… మార్కెట్ చేసుకోవడానికి హడావుడే తప్ప, అయనకు అంత సీన్ లేదని అన్నారు.

వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల, బీఎస్సీ నేత ప్రవీణ్ కుమార్ లు జాతీయ పార్టీలకు తొత్తులని విమర్శించారు. ఎప్పుడూ కేసీఆర్ గురించి మాట్లాడటం తప్ప కాంగ్రెస్, బీజేపీలను వీరు విమర్శించరని అన్నారు. వీరిద్దరూ టీఆర్ఎస్ ఓట్లను చీల్చి, జాతీయ పార్టీలకు మేలు చేయాలని చూస్తున్నారని చెప్పారు. దమ్ముంటే కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉండే రాష్ట్రాల్లో బీసీబంధు పెట్టాలని సవాల్ విసిరారు. బీజేపీకి సాయుధ పోరాటం గురించి మాట్లాడే హక్కు లేదని… ఆ రోజుల్లో సాయుధ పోరాటం చేసింది కమ్యూనిస్టులేనని చెప్పారు.

అవసరమైతే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లపై దేశద్రోహం కేసులు పెడతాం: కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అవసరమైతే వీరిద్దరిపై దేశద్రోహం కింద తెలంగాణ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ రాణేను మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

టాలీవుడ్ డ్రగ్స్ కేసు విషయంలో తన గురించి మాట్లాడటం, కేసీఆర్ ను తాగుబోతుగా మాట్లాడటాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. వైద్య పరీక్షల కోసం తన బ్లడ్ శాంపిల్ ను ఇవ్వడానికి తాను సిద్ధమని ఆయన అన్నారు. రాహుల్ రక్తాన్ని వైద్య పరీక్షల కోసం తీసుకోవాలని కాంగ్రెస్ నేతలకు ఆయన సవాల్ విసిరారు. అప్పుడు డ్రగ్స్ కు ఎవరు బానిసలు? అనే విషయం తేలుతుందని అన్నారు.

Related posts

‘అన్‌స్టాప‌బుల్ 2’లో చంద్ర‌బాబు చెప్పిన‌వ‌న్నీ అబద్దాలే: వైసీపీ ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి!

Drukpadam

గుడివాడలో క్యాసినో వ్య‌వ‌హారంపై ఢిల్లీలో ఈడీకి ఫిర్యాదు చేసిన రామ్మోహ‌న్ నాయుడు!

Drukpadam

మీడియా మిత్రులారా, దయచేసి కేసీఆర్ ట్రాప్ లో పడకండి: షర్మిల!

Drukpadam

Leave a Comment