Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

రెస్టారెంట్‌లో చికెన్ బిర్యానీ తిని ర‌క్తం కక్కుకుని యువ‌కుడి మృతి!

రెస్టారెంట్‌లో చికెన్ బిర్యానీ తిని ర‌క్తం కక్కుకుని యువ‌కుడి మృతి
-నర్సంపేట ప‌ట్ట‌ణంలో ఘ‌ట‌న‌!
-రెస్టారెంట్‌లో శాంపిల్స్ సేక‌రించిన అధికారులు
-యువ‌కుడి మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లింపు

రెస్టారెంట్లలో ఫుడ్ పై రకరకాల చర్చ జరుగుతూనే ఉంది . ఒక మాంసం బాధలు మరో మాంసం పెడతారని , రోజుల తరబడి నిల్వ ఉండే మాంసం వాడుతారని అనేక హోటల్స్ పై దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక హోటల్ లో చికెన్ బిర్యానీ తిన్న వ్యక్తి వాంతులు ,విరోచనాలతో రక్తం కక్కుకొని చావడం మొదటి సరిగా వింటున్నాం , ఇదే ఎక్కడో ఏరే దేశంలో జరగలేదు , వేరే రాష్ట్రంలో కూడా కాదు . వరంగల్ రురల్ జిల్లాలోని చిన్నారావు పేట మండలం లో జరిగింది ఈ ఘటన … దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కల్తీ ఆహార నిరోధక శాఖ వారు కూడా దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు.

ఓ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ తిన్న యువ‌కుడు ఆ వెంట‌నే ర‌క్తం కక్కుకుని మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే, ఈ ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది. చెన్న‌రావుపేట మండ‌ల ప‌రిధిలోని బోడ తండా వాసి ప్ర‌సాద్(23) ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. త‌న‌కు ఇష్ట‌మైన‌ చికెన్ బిర్యానీ తిన్నాడు.

అయితే, రెస్టారెంట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే అతనికి వాంతులు వ‌చ్చాయి. ర‌క్తం కూడా నోట్లో నుంచి ప‌డ‌డంతో ఈ విష‌యాన్ని గుర్తించిన‌ స్థానికులు పోలీసుల‌కు ఫోన్ చేశారు. పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని వెంట‌నే ప్ర‌సాద్‌ను క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌కుతీసుకెళ్ల‌గా అప్ప‌టికే ప్ర‌సాద్ మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు చెప్పారు. మునిసిప‌ల్ అధికారులు రెస్టారెంటుకు చేరుకుని అక్క‌డి ఫుడ్ శాంపిల్స్‌ను సేక‌రించి ప‌రిశీలిస్తున్నారు. ప్ర‌సాద్ మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆయ‌న మృతికి గ‌ల కార‌ణాలు పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డ‌య్యే అవ‌కాశం ఉంది.

Related posts

కారులో తిప్పుతూ మోడల్‌పై సామూహిక అత్యాచారం!

Drukpadam

తండ్రికి కూతురు ఝలక్ …. ఇంటినుంచి కోటి రూపాయల డిమాండ్ …

Drukpadam

నాగోలు ఫ్లై ఓవర్‌పై బీభత్సం సృష్టించిన ట్యాంకర్ .. కార్లు, బైకుల ధ్వంసం!

Drukpadam

Leave a Comment