Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైట్ ఛాలంజ్ కు దూరంగా కేటీఆర్ …కేటీఆర్ కోసం ఎదురు చుసిన రేవంత్ ,విశ్వేశర రెడ్డి!

వైట్ ఛాలంజ్ కు దూరంగా కేటీఆర్కేటీఆర్ కోసం ఎదురు చుసిన రేవంత్ ,విశ్వేశర రెడ్డి!
కేటీఆర్ వస్తే ఆయన గౌరవం పెరిగేదన్న విశ్వేశర రెడ్డి
వైట్ ఛాలంజ్ కు రెడీ అన్న బండి సంజయ్
మధ్యాహ్నం 12 గంటలకు రా అంటూ రేవంత్ సవాల్..
అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చిన కేటీఆర్.. హీటెక్కిన ట్విట్టర్
డ్రగ్స్ వ్యవహారంలో రేవంత్, కేటీఆర్ మధ్య ఛాలెంజ్ లు
రాహుల్ గాంధీ వస్తే తాను టెస్టుకు సిద్ధమన్న కేటీఆర్
ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా అంటూ రేవంత్ కు ఛాలెంజ్
కేసీఆర్ కూడా రెడీ అయితే.. లై డిటెక్టర్ టెస్టుకు నేను సిద్ధం: కేటీఆర్ కు రేవంత్ ప్రతిసవాల్
ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా? అని కేటీఆర్ సవాల్
సహారా, ఈఎస్ఐ కుంభకోణాల కేసుల్లో లై డిటెక్టర్ టెస్టుకు కేసీఆర్ సిద్ధమా? అని రేవంత్ ప్రశ్న
టైమ్, ప్లేస్ చెప్పాలంటూ కేటీఆర్ కు సవాల్
ముదిరిన వివాదం.. పరువునష్టం దావా వేసిన కేటీఆర్
చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించానన్న కేటీఆర్
అపరాధులు బుక్ అవుతారని వ్యాఖ్య

వైట్ ఛాలంజ్ విసిరిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి …. కేటీఆర్ తన నిజాయతీని నిరూపించుకునేందుకు వైట్ ఛాలంజ్ స్వీకరించి గాన్ పార్క్ దగ్గరకు రావాలని ఉదయం 12 గంటలకు తాను వస్తానని రేవంత్ చెప్పి అక్కడకు వెళ్ళేరు . కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా అక్కడకు చేరుకున్నారు. కానీ కేటీఆర్ రాలేదు. దింతో తమకు విసిరిన ఛాలంజ్ కు రాలేదని అందువల్ల కేటీఆర్ పారిపోయినట్లు గా భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు.

డ్రగ్స్ వాడేవారికి కేటీఆర్ బ్రాండ్ అంబాసడర్ అంటూ రేవంత్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సమాధానంగా నార్కోటిక్ పరీక్షలు చేయించుకోవడానికి తాను సిద్ధమని.. రాహుల్ గాంధీ కూడా డ్రగ్స్ టెస్టు చేయించుకుంటే, తాను కూడా చేయించుకుంటానని సవాల్ విసిరారు.

దేశంలోని యువతకు డ్రగ్స్ పై అవగాహన కలిగించేందుకు తాను, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కలిసి వైట్ ఛాలెంజ్ ను ప్రారంభించామని… ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఇద్దరం కలిసి కేటీఆర్ కోసం వేచి చూస్తుంటామని ట్వీట్ చేశారు.

రేవంత్ ట్వీట్ కు కేటీఆర్ అదే స్థాయిలో ప్రతిస్పందించారు. ఢిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రిలో టెస్ట్ చేయించుకోవడానికి తాను సిద్ధమని… రాహుల్ గాంధీ కూడా టెస్టులకు రావాలని సవాల్ విసిరారు. చర్లపల్లి జైల్లో గడిపిన వ్యక్తులతో సవాల్ స్వీకరించడం తన స్థాయికంటే చాలా తక్కువని అన్నారు. నార్కోటిక్ పరీక్షల్లో తనకు క్లీన్ చిట్ వస్తే… బేషరతుగా క్షమాపణలు చెప్పి, పదవులకు రాజీనామా చేస్తారా? అని ఛాలెంజ్ చేశారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధమా? అని సవాల్ చేశారు. వీరిద్దరి ఛాలెంజ్ లతో ఈరోజు ట్విట్టర్ హీటెక్కింది.

మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు పరస్పరం విసురుకుంటున్న సవాళ్లతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. డ్రగ్స్ వాడేవాళ్లకు కేటీఆర్ బ్రాండ్ అంబాసడర్ అని రేవంత్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద వేచి చూస్తుంటానని… దమ్ముంటే రావాలంటూ కేటీఆర్ కు రేవంత్ తాజాగా సవాల్ విసిరారు. దీనికి ప్రతిస్పందనగా టెస్టుకు తాను సిద్ధమని, అయితే తనతో పాటు రాహుల్ గాంధీ కూడా పరీక్షలు చేయించుకోవడానికి రావాలంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షకు మీరు సిద్ధమా? అని ఛాలెంజ్ చేశారు.

కేటీఆర్ విసిరిన సవాల్ కు రేవంత్ అదే స్థాయిలో ప్రతిస్పందించారు. లై డిటెక్టర్ పరీక్షకు తాను సిద్ధమని… సహారా ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కుంభకోణాల్లో సీబీఐ కేసుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధం కావాలని అన్నారు. కేసీఆర్ సిద్ధమైతే టెస్టుకు తాను కూడా సిద్ధమని… టైమ్, ప్లేస్ చెప్పాలంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు.

రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ ల మధ్య వివాదం మరింత ముదిరింది. ఇప్పటి వరకు సవాళ్లు, ప్రతి సవాళ్లతో కొనసాగిన వివాదం ఇప్పుడు కోర్టు మెట్లెక్కింది. ఈరోజు తాను చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించానని… కోర్టులో పరువునష్టం దావా వేశానని కేటీఆర్ ప్రకటించారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని… అబద్ధాలను కోర్టు రుజువు చేస్తుందని, అపరాధులు తగిన విధంగా బుక్ అవుతారని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్ లో ఎక్కడా కూడా నేరుగా రేవంత్ రెడ్డి పేరును పేర్కొనకపోవడం గమనార్హం. ఈ ట్వీట్ కు రేవంత్ ఎలా ప్రతిస్పందిస్తారో వేచి చూడాలి.

 

 

 

Related posts

రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించిన టీఆర్ఎస్ … ఘర్షణ, ఉద్రిక్తత…

Drukpadam

బీజేపీ అడ్డుకట్ట వేయాల్సిందే …అందుకు ప్రతిపక్షాల ఐక్యత అవసరం: శరద్ పవార్…

Drukpadam

గోరంట్ల బుచ్చయ్య ఆగ్రహం చల్లారిందా..? ఇది టీ కప్పులో తుఫానేనా ??

Drukpadam

Leave a Comment