Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మల్లి కెనడాలో ట్రూడోనే… మైనార్టీ ప్రభుత్వమే…2017 ఫలితాలు రిపీట్…

మల్లి కెనడాలో ట్రూడోనే… మైనార్టీ ప్రభుత్వమే…2017 ఫలితాలు రిపీట్…
-మ్యాజిక్ ఫిగర్ 170 ట్రూడో పార్టీ గెలిచింది 156 …
– ప్రధాన ప్రతిపక్షం కన్జర్వేటివ్ పార్టీ గెలిచిన సీట్లు 122 …
-ఇంకా కావాల్సిన సీట్లు 14 జగ్ మీత్ సింగ్ పార్టీ ఎన్డీపీ గెలిచినవి 27  
కెనడా లో మళ్లీ మనోడే కింగ్‌మేకర్..

హోరాహోరి గా సాగిన కెనడా ఎన్నికల్లో జస్టిన్ ట్రూడో మల్లి అధికారం చేపట్టబోతున్నారు.అయితే ఈసారికూడా ట్రూడో మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. లిబరల్ పార్టీకి చెందిన ప్రధాని ట్రూడో కరోనా కారణంగా ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నించి ఎన్నికల్లో పూర్తీ మైజార్టి కోసం ప్రయత్నించారు. ప్రచారం సందర్భంగా కొందరు ట్రూడో పై రాళ్ల దాడి కూడా చేశారు. ఎన్నికల ప్రీపోల్ సర్వ్య్ లో కన్సర్వేటివ్ పార్టీ ,లిబరల్ పార్టీ మధ్య హోరాహోరీ పోరు ఉన్నట్లు తేలింది. ఒక సందర్భంలో కంజర్వేటివ్ లే అధికారంలోకి వస్తారని భావించారు. కానీ ట్రూడో అనూహ్యంగా పుంజుకొని మందంజలోకి వచ్చారు.

ఎన్నికల ఫలితాల్లో ప్రధాని జస్టీన్ ట్రూడో నేతృత్వంలోని అధికార లిబరల్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని సాధించడంలో విఫలమైనప్పటికీ మల్లి ట్రూడోనే ప్రధాని పీఠం అధిష్టించనున్నారు.. మొత్తం 338 సీట్లు ఉన్న హైస్ ఆఫ్ కామన్స్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 170 సీట్లు కావాలి. కానీ, ట్రూడో పార్టీ 156 సీట్లకే పరిమితమైంది. దీంతో ట్రూడోకు మరోసారి పగ్గాలు చేపట్టేందుకు 14 సీట్లు కావాలి. అటు జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమొక్రటిక్ పార్టీ(ఎన్‌డీసీ) ఏకంగా 27 సీట్లు గెలిచింది. 2017 కంటే ఈసారి 3 సీట్లు అధికంగా గెలవడం విశేషం. ఇక ప్రధాన ప్రతిపక్షమైన కన్జర్వేటివ్ పార్టీ 122 సీట్లు మాత్రమే సాధించింది. దీంతో అందరి దృష్టి ఇప్పుడు న్యూ డెమొక్రటిక్ పార్టీ అధినేత జగ్మీత్ సింగ్‌పై ఉంది. ఎందుకంటే ట్రూడో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మళ్లీ జగ్మీత్ సాయం తీసుకోవాల్సిందే. 2017 మాదిరిగానే ఈసారి కూడా అదే మ్యాజిక్ రీపిట్ కావడంతో మనోడే కింగ్‌మేకర్‌గా మారారు.

Related posts

బీజేపీకి షాక్ …. నలుగురు కార్పొరేటర్లు టీఆర్ యస్ లో చేరిక !

Drukpadam

గోడల మీద పేరు సులువుగా చెరప గలరేమో కానీ ప్రజల మనసుల్లో చెరప లేరు…ఎమ్మెల్యే సీతక్క!

Drukpadam

ప్రగతిభవన్‌లో కేసీఆర్ జీవో తయారు చేసి, ఏపీ సీఎం జగన్‌కు కానుకగా ఇచ్చారు: రేవంత్ రెడ్డి విమర్శలు!

Drukpadam

Leave a Comment