Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చెల్లెలుకి అన్న ఆశీస్సులు ఉంటాయి -కొండా రాఘవరెడ్డి

చెల్లెలుకి అన్న ఆశీస్సులు ఉంటాయి -కొండా రాఘవరెడ్డి
-ఓర్వలేకనే అబద్దపు ప్రచారాలు
వైయస్ షర్మిలకు తన అన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉంటాయని షర్మిల ముఖ్య అనుచరుడు కొండా రాఘవరెడ్డి స్పష్టం చేశారు. కొన్ని పత్రికలలో వారి కుటుంబం గురించి , తప్పుడు ప్రచారం చేయటం దుర్మార్గం అన్నారు. అన్న చెల్లికి మధ్య గొడవలు ఉన్నాయని , వైయస్ కుటుంబమును ప్రేమించే అభిమానులను కించపరచటమే అన్నారు. ఈర్షతో చేసే విమర్శలు తప్ప ఏముందని అన్నారు. తెలంగాణ రాజకీయాలలో కీలకంగా వ్యవహరించాలని ఆమె భావిస్తున్నారని అంత మాత్రం చేత ఎదో జరిగి పోతుందని అనుకోవడం భ్రమే అవుతుందన్నారు. షర్మిల తెలంగాణ ప్రజల కోరిక మేరకే వస్తున్నారని అందువల్ల ఆమెపై బురదచల్లే కార్యక్రమాలు సరైనవి కావన్నారు. జిల్లాలో పర్యటించి ప్రజల అభిప్రాయాలూ తెలుసుకున్న తరువాతనే తన రాజకీయ ప్రయాణాన్ని గురించి వెల్లడించే అవకాశం పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే నల్లగొండ అభిమానులతో సమావేశం అయినా షర్మిల ఈనెల 21 ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం కావాల్సివుంది. కానీ పట్టభద్రుల ఎన్నికల రీత్యా తన పర్యటన వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు.తరువాత వెంటనే ఆమె బెంగుళూరు వెళ్లి తిరిగి వచ్చారు. ఆమె బెంగుళూరు పోయిన విషయంపై కూడా రకరకాల అభిప్రాయాలూ వెలువడ్డాయి. వివిధ రాజకీయ పార్టీలు సైతం తమకు తోచిన విధంగా వ్యాఖ్యానించటం చేశాయి. కాంగ్రెస్ నాయకులూ కొందరు కేసీఆర్ వదిలిన బాణం అన్నారు. మరికొందరు .బీజేపీ సలహామేరకు ఆమె పార్టీ పెట్టారని అన్నారు. అమిత్ షా ఆమెను కలిసేందుకు టైం కూడా ఫిక్స్ అయిందని వార్తలు వస్తున్నాయి. మరికొందరు అయితే ఆమెకు చాల అన్యాయం జరిగిందని అన్న ఆమెకు వెన్నుపోటు పొడిచారని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. అయన జైల్లో ఉండగా పార్టీకి అంత తానై వ్యవహరించిన షర్మిల ను పక్కన పెట్టడం పై జగన్ పై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. బీజేపీ మాత్రం ముమ్మాటికీ కేసీఆర్ కుట్రలో భాగమే షర్మిల రాజకీయ రంగ ప్రవేశం అంటున్నారు. షర్మిల రాజకీయాలు మొత్తానికి తెలంగాణ రాజకీయాలలో వేడెక్కించాయి.

Related posts

అమ‌రీంద‌ర్ ప్ర‌ధాన స‌ల‌హాదారు ప‌ద‌వికి ప్ర‌శాంత్ కిశోర్ రాజీనామా!

Drukpadam

2024లో బీజేపీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే దేశం సర్వనాశనం అవుతుంది: డి. రాజా

Drukpadam

పార్టీలోకి కొత్త వారి చేరిక‌ను అడ్డుకోకండి: బీజేపీ నేత‌ల‌కు జేపీ న‌డ్డా!

Drukpadam

Leave a Comment