Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం లో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బంద్ నిర్వహించిన అఖిలపక్షం!

ఖమ్మం లో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బంద్ నిర్వహించిన అఖిలపక్షం!
-బస్ స్టాండ్ వద్ద బైఠాయించిన నాయకులు
-నూతన వ్యవసాయ చట్టాలు రద్దు అయ్యేవరకు ఉద్యమం కొనసాగుతుందన్న నాయకులు
-ఖమ్మం జిల్లా వ్యాపితంగా బంద్ ప్రశాంతం

19 రాజకీయపార్టీలు ,వివిధ ప్రజాసంఘాలు , స్వచ్చంద సంస్థలు , ఆధ్వరంలో జరుగుతున్న భారత్ బంద్ లో భాగంగా సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జయప్రదంగా జరిగింది. బస్ లు కదలలేదు. విద్యాలయాలు మూతపడ్డాయి .భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైతం బంద్ జయప్రదంగా జరిగింది. అఖిలపక్ష నాయకులు కొత్తగూడెం బస్ స్టాండ్ వద్ద బైఠాయించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వామపక్షాలు , కాంగ్రెస్ , టీడీపీ ,తెలంగాణ ఇంటి పార్టీ ల కార్యకర్తలు బైపాస్ రోడ్ లో గల నూతన బస్ స్టాండ్ దగ్గర బైటయించారు . ఈ సందర్భంగా సిపిఎం సిపిఐ , ఎం ఎల్ డెమోక్రసీ కాంగ్రెస్ , టీడీపీ ,తెలంగాణ ఇంటి పార్టీ నాయకులు మాట్లాడుతూ రైతులకు ఉరితాళ్లుగా ఉన్న నల్ల చట్టాలను రద్దు జరిగే వరకు పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించారు. గత 300 రోజులుగా నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ కోరుతూ కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వరంలో చేస్తున్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమని విమర్శించారు. రాష్ట్రంలో కేడి ,కేంద్రంలో మోడీ తాము రైతులకు మేలు చేస్తున్నామని చెబుతూనే రైతు చట్టాలను రద్దు చేయకపోవడం ,వాటిని సమర్థించడం దారుణమని అన్నారు. రైతుల ఓట్లతో గద్దెనెక్కి రైతులకు ద్రోహం చేస్తున్న పాలకుల విధానాలను దేశం మొత్తం వ్యతిరేకిస్తున్న విషయాన్నీ నాయకులు గుర్తు చేశారు .

నల్ల చట్టాల రద్దు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా దేశం యావత్తు ఒకే గొంతుతో నినాదిస్తున్నదని అన్నారు. కేవలం ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రైతులు ,రెండు మూడు రాష్ట్రాల కు చెందిన ఉద్యమమేనని కేంద్రం చెప్పటాన్ని వారు తప్పు పట్టారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు ముక్త కంఠంతో ప్రజలు కోరుతున్న విషయాన్నీ రుజువు చేసిందని అన్నారు. ఈ బంద్ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు , సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు , కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ , ఎం ఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు అశోక్ , ఇతర నాయకులు పాల్గొన్నారు.

Related posts

విశాఖ ఎంపీ పై పవన్ కళ్యాణ్ చిందులు …

Ram Narayana

దేశవ్యాపితంగా కాంగ్రెస్ కవాత్…తెలంగాణాలో రేవంత్ ,భట్టి పాదయాత్రలు!

Drukpadam

బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారని దానిలో వాస్తవం లేదు … బుగ్గన- బుర్ర కథలు చెప్పవద్దు …. పయ్యావుల…

Drukpadam

Leave a Comment