Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సిక్సర్ల సిద్దు ప్రయాణం ఎటు …. కాషాయమా? చీపురు పడతారా ?

సిక్సర్ల సిద్దు ప్రయాణం ఎటు …. కాషాయమా? చీపురు పడతారా ?
-కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బకొట్టిన సిద్దు
-సిద్దు మాటలు నమ్మి అమరిందర్ ను దూరం చేసుకున్న కాంగ్రెస్
-రాజ‌కీయాల్లో రాజీప‌డ‌బోననంటున్న సిద్దు
-పంజాబ్‌ భవిష్యత్తే నాకు ముఖ్యం
-ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌న్నదే నా ఉద్దేశం
-ఎవ‌రితోనూ వ్య‌క్తిగ‌తంగా వైరం లేదు
-ప్ర‌జ‌ల జీవితాల‌ను మార్చేందుకే కృషి

పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష ప‌ద‌వికి నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూ అనూహ్యంగా రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆయన ప్రయాణమెటు అనేది ఆశక్తిగా మారింది. ఆయన కాషాయం పార్టీలో చేరతారా ? లేక ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారా ? అనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఆయన్ను నమ్ముకున్న కాంగ్రెస్ ను సిద్దు నట్టేట ముంచారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రిగా ఉండి కాంగ్రెస్ ను రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన అమరిందర్ ను దూరం చేసుకుంది . ఆయన్ను ముఖ్యమంత్రి కుర్చీ మీద నుంచి దింపే వరకు సిద్దు విశ్రమించలేదు. చివరకు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశం మేరకు అమరిందర్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో దళిత వర్గానికి చెందిన చరణ్ జీత్ సింగ్ చన్నీని పంజాబ్ సీఎం గా కాగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యే అభిప్రాయం మేరకు నియమించింది. అయినప్పటికీ సిద్దులో ఎదో బయటకు చెప్పని అంశం ఉంది. అందువల్లనే ఆయన సీఎం మారినప్పటికీ అసంతృప్తి గానే ఉన్నారు. బహుశా సీఎం పీఠం మీద ఆయన్ను కూర్చోబెట్టాలం భావించివుంటారు. అదికుదరలేదు .అందువల్ల పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన్ను నమ్ముకుని సీఎం అమరిందర్ ను గద్దె దింపిన కాంగ్రెస్ కు తగిన శాస్తి జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

పంజాబ్‌ భవిష్యత్తుపై తాను ఎప్పటికీ రాజీ పడలేనని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారాయి. పీసీసీ ప‌ద‌వికి రాజీనామాపై ఆయ‌న ఈ రోజు స్పందిస్తూ ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌న్నదే త‌న ఉద్దేశ‌మ‌ని చెప్పుకొచ్చారు. త‌న‌కు ఎవ‌రితోనూ వ్య‌క్తిగ‌తంగా వైరం లేద‌ని చెప్పారు.

తాను ప్ర‌జ‌ల జీవితాల‌ను మార్చేందుకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చానని, త‌న సిద్ధాంతాల‌పై రాజీప‌డ‌బోన‌ని సిద్ధూ ప్ర‌క‌టించారు. కాగా, పంజాబ్ రాజ‌కీయాలు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా మ‌లుపులు తిరుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సిద్ధూ త‌న మ‌ద్ద‌తుదారుల‌తో క‌లిసి బీజేపీ లేక ఆమ్ ఆద్మీ పార్టీలో చేర‌తార‌ని ఊహాగానాలు వ‌స్తున్నాయి. పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో చోటు చేసుకుంటోన్న ప‌రిణామాలు ఆస‌క్తికరంగా మారాయి.మరోపక్క, పంజాబ్ కాంగ్రెస్ నేత‌ల‌తో చ‌ర్చించేందుకు త్వ‌ర‌లోనే ఆ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్రానికి వెళ్ల‌నున్నారు.

Related posts

అన్నయ్య జపం- పవన్ రహస్యం ఏమిటి ?

Drukpadam

స‌స్పెన్ష‌న్‌ను బీజేపీ నేత‌లు కోరుకున్నారు: హ‌రీశ్ రావు!

Drukpadam

కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రచారం పై ఈటల మండిపాటు…

Drukpadam

Leave a Comment