తీరుమారని రాజకీయాలు …తిట్ల దండకాలతో కొనసాగిన పవన్ ప్రసంగం…
-అనాల్సినవన్నీ అనేసి కులాల వెనుక దాక్కుంటే లాక్కొచ్చి తంతా అంటూ వార్నింగ్
-జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్
-‘వైసీపీ గ్రామసింహాలు..’ అంటూ ప్రసంగం ప్రారంభించిన పవన్ కల్యాణ్
-డబ్బు, అధికారం, మదం, మాత్సర్యం వంటి లక్షణాలు వైసీపీ నేతలకు పుష్కలంగా ఉన్నాయి
-కొన్నిరోజుల క్రితం చేసిన ట్వీట్‌ను వల్లెవేసిన జనసేనాని
-బాపట్లలో పుట్టినోడిని నాకు బూతులు రావా? అంటూ ప్రశ్న
తీరుమారని మారని రాజకీయాలు …తిట్ల దండకాల్తో కొనసాగిన పవన్ ప్రసంగం … జనేసేన విస్తృతస్థాయి సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగంలో మరోసారి వైసీపీ పై విరుచుకపడ్డారు .ఒక రాజకీయ నేతగా ఆయనకు ఆ హక్కు ఉంది. ఒకపార్టీని మరో పార్టీ విమర్శించడంలో ఎలాంటి తప్పు లేదు … కానీ వ్యక్తిగత దూషణలు , తంతా,గుద్దుతా , సన్నాసులు , కులాల ప్రస్తావన వైసీపీ నేతలు చేసినా , జనసైనికులు చేసినా తప్పే అవుతుంది. అది పవన్ కళ్యాణ్ అయినా , పేర్ని నాని అయినా ఒకటే . అందునా పార్టీ అధ్యక్షుడిగా ఒక భాద్యత గల పదవిలో ఉండి పార్టీని నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ మాటలు తిట్ల దండకాలు గా ఉండటం సమంజసం కాదేమో ననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి .తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలపై ఏ ఇద్దరు మాట్లాడిన పవన్ ,వైసీపీ మంత్రుల మధ్య జరిగిన మాటల యుద్ధంపై ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి.తెలంగాణాలో రాజకీయాలు వేరు , ఆంధ్రా లో రాజకీయాలు వేరు .. ఆంధ్ర రాజకీయాల్లో తిట్ల రాజకీయాలను అంగీకరించరు. పైగా అలంటి వారిని హిలాన్లు గా చూస్తారు . ఎవరిదీ తప్పు ఎవరిదీ రైట్ అనేది పక్కన పెడితే ఇలాంటి తిట్ల దండకాలు ,ప్రారంభం కావడానికి కారకులు ఎవరు ? అనేది చర్చనీయంశంగా మారింది . ఇది ఇంతటితో ఆగుతుందని అనుకుంటున్న తరుణంలో, జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పవన్ ప్రసంగం అదే తరహాలో సాగింది.
‘‘తుమ్మెదల ఝూంకారాలు.. ఏనుగుల ఘీంకారాలు.. మా మహిళా నేతల పదఘట్టనలు.. జనసైనికుల సింహగర్జనలు.. వైసీపీ గ్రామసింహాల గోంకారాలూ సహజం’’ అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన ప్రసంగం ప్రారంభించారు. బుధవారం నాడు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ నేతలపై ఘాటుగా సెటైర్లు వేశారు.
కొన్నిరోజుల క్రితం కూడా ట్విట్టర్లో ‘.. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు’ అంటూ పవన్ ఒక కవిత షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కూడా అదే కవితతో పవన్ ప్రసంగం మొదలుపెట్టారు. పదహారేళ్ల కుర్రాళ్లే వైసీపీ నేతలకు సంస్కారం నేర్పిస్తారని ఆయన అన్నారు. డబ్బు, అధికారం, మదం, మాత్సర్యం వంటి లక్షణాలు వైసీపీ నేతలకు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. వారికి ఇంక భయం ఒక్కటే లేదని, దాన్ని తాను కచ్చితంగా నేర్పిస్తానని అన్నారు.
అనాల్సిన మాటలన్నీ అనేసిన తర్వాత కులాల వెనుక దాక్కుంటే బయటకు లాక్కొచి కొడతానని పవన్ హెచ్చరించారు. పార్టీ పెట్టిన నాటి నుంచి తాను చాలా బాధ్యతగా ఉన్నానని, ఒక మాట కూడా తూలడం జరగలేదని చెప్పారు. తాను బాపట్లలో పుట్టానని, తనకు బూతులు రావా? అని ప్రశ్నించారు.