Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సుప్రీం మెట్లు వెక్కిన శ్రీవారి పూజల వ్యవహారం …

టీటీడీలో పూజలు సక్రమంగా చేయకపోతే వేంకటేశ్వరస్వామి క్షమించడు: జస్టిస్ ఎన్వీ రమణ
-శ్రీవారికి ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగడం లేదని సుప్రీంకోర్టులో పిటిషన్
-స్వామివారి మహిమలు అందరికీ తెలుసన్న సీజేఐ
-పూర్తి వివరాలను ఇవ్వాలంటూ టీటీడీ న్యాయవాదికి ఆదేశం

తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామికి ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగడం లేదంటూ దాఖలైన పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. పూజలను సక్రమంగా నిర్వహించకపోతే వేంకటేశ్వరస్వామి ఉపేక్షించరని చెప్పారు. స్వామివారి మహిమలు అందరికీ తెలుసని అన్నారు. తాను కూడా శ్రీవారి భక్తుడినేనని చెప్పారు.

టీటీడీపై పిటిషనర్ చేసిన ఆరోపణల్లో నిజం ఉందా అనే విషయాన్ని తాము తెలుసుకోవడం కోసం వారంలోగా పూర్తి వివరాలను ఇవ్వాలని టీటీడీ తరపు న్యాయవాదిని ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. ఈ అంశంపై పిటిషనర్ ఇంతకు ముందు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే టీటీడీలో జరిగే పూజల విషయంలో కోర్టులు జోక్యం చేసుకోలేవని హైకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో పిటిషనర్ సవాల్ చేశారు.

Related posts

99 తప్పులు చేసిన జగన్.. ఇదొక్క మంచి పని చేశారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి!

Drukpadam

తప్పుటడుగులే…మా కొంప ముంచాయి … శ్రీలంక అధ్యక్షడు!

Drukpadam

సీనియర్ నటుడు కృష్ణంరాజు కన్నుమూత…తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం…!

Drukpadam

Leave a Comment