Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేటీఆర్ కనిపించుటలేదు’… హైదరాబాద్ నగర శివార్లలో నిరసన పోస్టర్లు….

కేటీఆర్ కనిపించుటలేదు’… హైదరాబాద్ నగర శివార్లలో నిరసన పోస్టర్లు….
-ఇటీవల భారీ వర్షాలు, వరద పరిస్థితులు
-ప్రభుత్వం స్పందించడంలేదన్న రంగారెడ్డి జిల్లా వాసులు
-మిస్సింగ్ అంటూ కేటీఆర్ పై పోస్టర్లు
-నిరసన తెలియజేసిన ప్రజలు

నిత్యం హైద్రాబాద్ నగరంలో పర్యటిస్తూ , ఎదో ఒక కార్యక్రమంలో బిజీ గా ఉంటూ తనకొస్తున్న ట్విట్టర్ అకౌంట్ కు జవాబులు ఇస్తూ జోరుగా హుషారుగా ఉండే కేటీఆర్ కనిపించడంలేదంటూ పోస్టర్లు వెలవటం ఆశ్చర్యమే ! అయితే ప్రజల నిరసనకు కారణం లేకపోలేదు. ఇటీవల తుఫాన్ కారణంగా హైద్రాబాద్ నగరం అనేక సార్లు జలమయమైంది. తమ ఇళ్ల ముందు ఉన్న బురద నీటిని తొలగించేందుకు జీహెచ్ ఎంసీ వాళ్ళ ఎవరు రాకపోవడం ప్రజల ఆగ్రహానికి కారణమైంది.అయన కనపడాల్సిన అవసరం లేదు . సిబ్బందిని పంపి నీటిని వెంటనే తొలగిస్తే ప్రజల నుంచి మంత్రి కేటీఆర్ ఆర్ కు ఈ పోస్టర్ ప్రదర్శన ఉండేదికాదు అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు, వరద పరిస్థితులు సంభవించిన నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కనిపించడం లేదంటూ పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలోని జల్ పల్లి, బడంగ్ పేట్, బాలాపూర్, ఉస్మాన్ నగర్ ప్రాంతాల్లో ఈ పోస్టర్లు కనిపించాయి.

మిస్సింగ్… ఇతన్ని మీరు చూశారా? అంటూ కేటీఆర్ ఫొటోతో ఆ పోస్టర్లు రూపొందించారు. తమ ప్రాంతాల్లో వరద సంబంధిత సమస్యలపై ఎన్ని మార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా స్పందించడంలేదన్న తీవ్ర ఆగ్రహంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఈ పోస్టర్ల ద్వారా తమ నిరసన తెలియజేశారు.

వర్షాకాలం వస్తే చాలు… లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రోడ్డు ప్రమాదాలు, అత్యవసర సర్వీసులు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వారు వాపోతున్నారు. ఓ సామాజిక కార్యకర్త దీనిపై స్పందిస్తూ, కేటీఆర్ ఎప్పుడూ సింగపూర్, డల్లాస్ గురించే మాట్లాడుతుంటారని, కానీ ఇక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఒక్కసారి వచ్చి పరిశీలించాలని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

Related posts

తెలంగాణ మరో బెంగాల్ కానున్నదా? బీజేపీ టార్గెట్ అదేనా

Drukpadam

రాహుల్ గాంధీ సభకు పెద్దఎత్తున జన సమీకరణ జరగాలి..సీఎల్పీ నేత భట్టి!

Drukpadam

కర్ణాటకలో బీజేపీ మంత్రి మాటలకూ కాంగ్రెస్ నిరసన …అసెంబ్లీ లోనే నిద్ర…

Drukpadam

Leave a Comment