Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాహుల్ ,ప్రియాంక వెంటే నా ప్రయాణం …నవజ్యోత్ సింగ్ సిద్దు ….

పదవి ఉన్నా, లేకపోయినా రాహుల్, ప్రియాంకల వెన్నంటే ఉంటా: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
-పంజాబ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు
-పీసీసీకి ఇటీవల రాజీనామా చేసిన సిద్ధూ
నిన్న సీఎంతో భేటీ
-సిద్ధూనే పీసీసీ చీఫ్ గా కొనసాగుతాడంటున్న కాంగ్రెస్ వర్గాలు

ఇటీవల అనూహ్యరీతిలో పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన నిర్ణయంపై పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. తాజాగా సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పై తన విధేయత వెల్లడయ్యేలా స్పందించారు. గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రిల సిద్ధాంతాలను మరింత ముందుకు తీసుకెళతానని తెలిపారు. తాను పదవిలో ఉన్నా, లేకపోయినా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల వెన్నంటే ఉంటానని స్పష్టం చేశారు.

“ప్రతికూల శక్తులన్నీ ఏకమై నన్ను ఓడించేందుకు ప్రయత్నించనివ్వండి. కానీ పాజిటివ్ ఎనర్జీలోని ప్రతి అణువు ఉప్పొంగి పంజాబ్ ను గెలిపిస్తుంది, పంజాబీయాత్ (విశ్వ సోదరభావం)ను నిలుపుతుంది, ప్రతి పంజాబీని విజయం వరిస్తుంది” అంటూ సిద్ధూ ట్వీట్ చేశారు.

ఇటీవల కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేయగా, కాంగ్రెస్ హైకమాండ్ చరణ్ జిత్ చన్నీని సీఎంగా ఎంపిక చేసింది. ఆ తర్వాత సిద్ధూ పీసీసీకి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. అయితే, నిన్న సిద్ధూ సీఎం చరణ్ జిత్ చన్నీతో భేటీ అయిన తర్వాత సమస్య పరిష్కారం అయినట్టు భావిస్తున్నారు. సిద్ధూ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతాడని తెలుస్తోంది.

పంజాబ్ కాంగ్రెస్ లో నెలకొన్న పరిణామాలు కాంగ్రెస్ కు తలనొప్పిగా మారగా , ప్రతిపక్షాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ప్రత్యేకించి బీజేపీ , ఆమ్ ఆద్మీ పార్టీ లు తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నాయి. మాజీ సీఎం అమరిందర్ అవమానకర రీతిలో తనను కాంగ్రెస్ సీఎం పదవి నించి దించి వేయడంపై ఆగ్రహంగా ఉన్నారు. ఆయన ఢిల్లీ వెళ్లి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలవడంతో బీజేపీ లో చేరనున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆయన అందాన్ని కొట్టి పారేశారు. కానీ సొంత పార్టీ పెట్టె ఆలోచనలో ఉన్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. పంజాబ్ పరిణామాల పై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఆలోచిస్తుంది. అమరిందర్ పెట్టబోయే పార్టీలో కాంగ్రెస్ నుంచి పెద్దగా డేమేజ్ జరగకుండా చూడాలనే యోచనలో ఉంది.

Related posts

ఖమ్మం జిల్లాలో పార్టీ డ్యామేజ్ కంట్రోల్ దిశగా బీఆర్ యస్ అడుగులు …

Drukpadam

మమత నిర్ణయంపై మండిపడ్డ విపక్ష అభ్యర్థి మార్గరెట్ ఆల్వా!

Drukpadam

బీజేపీ వైఖరిని తప్పు పట్టిన మంద కృష్ణ మాదిగ …

Drukpadam

Leave a Comment