Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

ఐపిల్ ఐదు సార్లు ఛాంపియన్ ముంబయికి అవమానకరం…

ఐపిల్ ఐదు సార్లు ఛాంపియన్ ముంబయికి అవమానకరం…
-ప్లే ఆఫ్ కు చేరకుండా ఇంటికేనా ….?
-నేడు ఢిల్లీ చేతిలోనూ ఓటమి చెందిన ముంబయ్
-లో స్కోరింగ్ మ్యాచ్ లో ఢిల్లీ పైచేయి
-మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి
-20 ఓవర్లలో 8 వికెట్లకు 129 రన్స్
-19.1 ఓవర్లలో 6 వికెట్లకు 132 రన్స్ చేసిన ఢిల్లీ
-శ్రేయాస్అయ్యర్ 33 నాటౌట్

ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ,బ్యాటింగ్ లోను బౌలింగ్ లో అరవీర భయంకరులు ఉన్న జట్టుగా పేరున్న ముంబయ్ ఈసారి ప్లే ఆఫ్ కు చేరకుండానే అవమానకరంగా టోర్నీ నుంచి నిష్క్రమించనున్నదా అంటే అవుననే సమాదానేమీ వస్తుంది. . ఇప్పటివరకు 12 మ్యాచ్ లు ఆడిన ముంబయ్ కేవలం 5 మ్యాచ్ లలో మాత్రమే నెగ్గింది. మరో రెండు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ,పంజాబ్ ,రాజస్థాన్ , జట్లు కూడా 5 మ్యాచ్ లు గెలిచి లీగ్ దశలో ప్లే ఆఫ్ కోసం ముంబయ్ తో పోటీ పడుతున్నాయి. నెట్ రన్ రేట్ చేస్తే ముంబయ్ కన్నా పంజాబ్ , రాజస్థాన్ జట్లు మెరుగ్గా ఉన్నాయి. దీంతో చివరి రెండు మ్యాచ్ లలో గెలిచినా ప్లే ఆఫ్ కు ముంబయ్ వెళ్ళ్తుందినే గ్యారంటీ లేదు …అయితే క్రికెట్ కదా ఏమైనా జరిగే అవకాశాలు కూడా కొట్టి పారేయలేము …

షార్జాలో ముంబయి ఇండియన్స్ తో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ క్రమంలో 6 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 33 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో ముఖ్యభూమిక పోషించాడు. కెప్టెన్ రిషబ్ పంత్ 26, అశ్విన్ 20 నాటౌట్, హెట్మెయర్ 15 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో బౌల్ట్, జయంత్, కృనాల్, బుమ్రా, కౌల్టర్ నైల్ తలో వికెట్ తీశారు.

 

 

 

Related posts

కోహ్లీ సెంచరీ మిస్సయినా… టోర్నీలో కివీస్ కు తొలి ఓటమి రుచిచూపిన టీమిండియా

Ram Narayana

టీనేజర్ లా సన్నగా మారిపోయిన రోహిత్ శర్మ కొత్త లుక్ !

Drukpadam

టీం ఇండియా కు ఇద్దరు కెప్టెన్లు కోహ్లీ, రోహిత్ శర్మ?

Drukpadam

Leave a Comment