Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

విద్యార్థి సంఘం నేత వెంకట్ కు హుజూరాబాద్ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్!

విద్యార్థి సంఘం నేతకు హుజూరాబాద్ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్
-ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు వెంకట్ బల్మూరికి కాంగ్రెస్ టికెట్
-ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక
-టీఆర్ఎస్ విద్యార్థి నేతకు టికెట్ ఇచ్చిన కేసీఆర్
-వ్యూహాత్మకంగా వ్యవహరించిన కాంగ్రెస్
-విద్యార్థి నేత వెంకట్ కు అవకాశం

అనేక తర్జన భర్జనలు అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటించింది. ఎన్ ఎస్ యూ ఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ కు అవకాశం ఇచ్చింది. ఇప్పటివరకు అనేక మంది పేర్లు పరిశీలనకు వచ్చాయి. కొండా సురేఖ పేరు ప్రముఖంగా వినిపించిన చివరి నిమిషయం ఆమె కండిషన్ లకు పార్టీ అంగీకరించలేదని తెలుస్తుంది. దీంతో వెంకట్ పేరును అధికారికంగా ప్రకటించారు. బిసి సామాజికవర్గానికి చెందిన వెంకట్ విద్యార్థి ఉద్యమం లో మంచి పట్టు ఉన్నవాడు అందువల్ల ఆయన అభ్యర్థిత్వం పట్ల అధిష్టానం మొగ్గుచూపింది.

త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరగనుండగా, కాంగ్రెస్ కూడా తన అభ్యర్థిని ప్రకటించింది. ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తాడని ఏఐసీసీ ఓ ప్రకటన చేసింది. వెంకట్ బల్మూరి ఇటీవలకాలంలో కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలు, ధర్నాల్లో ముందు నిలిచి పోరాడుతూ పార్టీ అధిష్ఠానం దృష్టిలో పడ్డాడు.

హుజూరాబాద్ అభ్యర్థిపై పార్టీలో చర్చ జరగ్గా, వెంకట్ పేరును సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమర్థించడంతో వెంకట్ అభ్యర్థిత్వం ఖరారైంది.

హుజూరాబాద్ బరిలో వెంకట్ ను ఎంచుకోవడం వెనుక కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు. దాంతో కాంగ్రెస్ కూడా తమ విద్యార్థి విభాగం నేత వెంకట్ బల్మూరిని రంగంలోకి దింపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Related posts

ఈటలకు కేసీఆర్ గాలం వేస్తున్నారా ?

Drukpadam

ఔరంగాబాద్‌ పేరు మార్పు …ఇక నుంచి శంభాజీ నగర్ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం!

Drukpadam

విశాఖ రాజధాని ప్రాంతం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి …

Drukpadam

Leave a Comment