Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అమెరికా కు తగ్గేదే లేదంటున్న ఉత్తర కొరియా అధ్యక్షడు కిమ్ !

అమెరికాను ఎదుర్కోవ‌డానికి త‌న సోద‌రికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన కిమ్‌!
శ‌క్తిమంత‌మైన నాయ‌కురాలిగా కిమ్‌ యో జోంగ్‌
ప్రభుత్వ వ్యవహారాల కమిటీ సభ్యురాలిగా నియమించిన కిమ్
గ‌తంలోనూ స‌మ‌ర్థంగా ప‌నిచేసిన కిమ్ సోద‌రి
దక్షిణ కొరియాపై ఒత్తిడి పెంచాల‌ని నిర్ణ‌యం

ఉత్తర కొరియా అధ్యక్షుడు కింజోంగ్ ఉన్ ఎక్కడ తగ్గేది లేదంటున్నాడు ..అమెరికా దేశంపై ఒకరకంగా సవాల్ విసురుతున్నాడు . తమ దేశంపై ఆంక్షలు విధించిన అమెరికా వాటిని తొలగించాలని కోరుతున్నాడు , అందుకోసం తమ దేశంలో ఆయన తరువాత అత్యంగ పవర్ ఫుల్ వ్యక్తిగా పేరున్న తన సోదరి కిమ్ కు అమెరికా వ్యవహారాల భాద్యతను అప్పగించారు.

అమెరికాపై నుంచి త‌మ డిమాండ్లను నెర‌వేర్చుకునేలా చేసే బాధ్య‌త‌ను ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన సోదరి కిమ్‌ యో జోంగ్‌కు అప్ప‌గించారు. ఈ మేర‌కు ఆమెను ప్రభుత్వ వ్యవహారాల కమిటీ సభ్యురాలిగా నియమించారు. దక్షిణ కొరియాపై ఒత్తిడి పెంచితే అమెరికా వెన‌క్కుత‌గ్గుతుంద‌ని ఉత్తర కొరియా భావిస్తోంది.

విదేశాంగ వ్యవహారాలను కిమ్‌ యో జోంగ్ స‌మ‌ర్థంగా నిర్వ‌హించ‌గ‌ల‌ర‌ని కిమ్ భావిస్తున్నారు. గ‌తంలోనూ ఆమె అమెరికాతో ప‌లు అంశాల్లో మెరుగైన ప‌నితీరును ప్ర‌ద‌ర్శించారు. త‌మ దేశంలో గ‌తంలో దక్షిణ కొరియా నిర్మించిన ఓ ఆఫీసును జూన్‌లో ఆమె ధ్వంసం చేయించారు.

ఉత్తర కొరియాతో చర్చలు జరపడానికి అమెరికా ఒప్పుకున్న స‌మయంలో యో జోంగ్ క‌ల‌గ‌జేసుకుని ప‌లు ష‌ర‌తులు పెట్టారు. ఉత్త‌ర కొరియాపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాల‌ని చెప్పారు. అలాగే, దక్షిణ కొరియాతో అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలను ఆపాల‌ని కిమ్‌ యో జోంగ్ డిమాండ్ చేశారు.

అనంత‌రం తాము దక్షిణ కొరియాతో షరతులతో కూడిన చర్చలు జరుపుతామన్నారు. అంతేగాక‌, ఇటీవ‌లే ఉత్త‌ర కొరియా మ‌ళ్లీ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. యో జోంగ్‌ను ఉత్తర కొరియాలో కిమ్‌ తరవాత అత్యంత శక్తిమంతమైన నేత‌గా దక్షిణ కొరియా గూఢచారి సంస్థ అభివ‌ర్ణించింది.

అమెరికా, దక్షిణ కొరియాలతో ఉత్త‌ర‌కొరియా చ‌ర్చ‌లు జ‌రిపితే ఇందులో యో జోంగ్ పాల్గొంటార‌ని నిపుణులు చెబుతున్నారు. కాగా, ఉత్తర కొరియా ష‌ర‌తుల‌ను అమెరికా ఒప్పుకోవ‌డం లేదు. అణ్వస్త్రాలను వ‌దులుకోవాల‌ని అమెరికా డిమాండ్ చేస్తుండ‌డంతో ఉత్త‌ర‌కొరియా అందుకు అంగీక‌రించ‌ట్లేదు.

Related posts

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద కన్నీరు పెట్టిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి !

Drukpadam

2019-20లో 108 కోట్లు ఖర్చు చేసిన టీడీపీ.. కనిపించని ఇతర పార్టీల లెక్కలు!

Drukpadam

ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం …. రూ.3 వేల కోట్లకు పైగా కోల్పోయే ప్రమాదం: జీవీఎల్!

Drukpadam

Leave a Comment