Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీడీపీ నుంచి కాకినాడ చేజారిపాయే …..షాక్ లో టీడీపీ శ్రేణులు !

టీడీపీకి షాక్.. కాకినాడ మేయర్ పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం
అత్యంత ఘోరంగా పదవి కోల్పోయిన మేయర్
మేయర్ పావనిపై అవిశ్వాస తీర్మానం
పావనికి ఒక్కరు కూడా చేయి ఎత్తని వైనం
-2017 కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికలు

కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. మేయర్ పావనిపై టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో, ఆమె అత్యంత ఘోరంగా అంటే ఆమెకు ఒక్కరంటే ఒక్కరు కూడా అనుకూలంగా చేతులెత్తక పోవడం విశేషం . పదవిని కోల్పోయారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 36 ఓట్లు వచ్చాయి. టీడీపీకి చెందిన 21 మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేయాగా, 9 మంది టీడీపీ కార్పొరేటర్లు తటస్థంగా ఉండిపోయారు. ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. వీరిలో మంత్రి కన్నబాబు, ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి ఉన్నారు.

కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కు 2017లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీడీపీకి 30, వైసీపీకి 8, బీజేపీకి 3 సీట్లు రాగా… ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపొందారు.

టీడీపీ ఏపీ లో అధికారంలో ఉండగా కాకినాడ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీ తో టీడీపీ కార్పొరేటర్లు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. 2019 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని కార్పొరేషన్లను వైసీపీ గెలుచుకుంది. కాకినాడ కార్పొరేషన్ తెలుగుదేశం ఏలుబడిలో ఉంది. అయితే అధికారంలో వైసీపీ ఉన్నందున అక్కడ తెలుగుదేశం పార్టీలోనే అసమ్మతి బయటపడి అవిశ్వాస తీర్మానం వరకు వెళ్ళింది. అవిశ్వాస తీర్మానంలోటీడీపీకి చెందిన 21 మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేయాగా, 9 మంది టీడీపీ కార్పొరేటర్లు తటస్థంగా ఉండిపోయారు. దీంతో మేయర్ పావని పదవి కోల్పోయింది. చంద్రబాబు నడిపిన రాజీ సూత్రాలు పని చేయలేదు.

 

 

Related posts

బద్ధ శత్రువులుగా ఉన్నోళ్లే కాంగ్రెస్‌లో చేరారు.. షర్మిల వస్తే తప్పేంటి?: భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు….

Drukpadam

నష్ట నివారణకు ఇదే చివరి అవకాశం.. సోనియాకు 13 పాయింట్లతో సిద్ధూ లేఖ…

Drukpadam

హరీశ్ రావు తోలుబొమ్మ… లక్ష ఓట్ల మెజార్టీతో ఈటల గెలుస్తారు: జితేందర్ రెడ్డి!

Drukpadam

Leave a Comment