Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

గిరిజనులకంటే దళితులకే భూమి తక్కువ …అసెంబ్లీ లో కేసీఆర్ …

గిరిజనుల కంటే కూడా దళితులే అత్యంత తక్కువ భూమి కలిగి ఉన్నారు: సీఎం కేసీఆర్

  • కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
  • దళితబంధుపై చర్చ
  • సీఎం కేసీఆర్ ప్రసంగం
  • దళితుల పరిస్థితి దయనీయం అని వెల్లడి

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. నేటి సభా సమావేశంలో దళితబంధు పథకంపై చర్చ చేపట్టగా, పథకం తీరుతెన్నులు, నేపథ్యం వంటి వివరాలు వెల్లడించారు. గిరిజనుల కంటే దళితులే అత్యంత తక్కువ భూమి కలిగి ఉన్నారని తెలిపారు. దేశంలో నేటికీ తీవ్ర వివక్షకు గురవుతున్న వాళ్లు దళితులేనని అన్నారు. ఇతర వర్గాలతో పోల్చితే దళితులు దయనీయ పరిస్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొని ఉందని, అయితే దళితులను ఆదుకోవడంపై నినాదాలు చేశారు తప్ప, పురోగతి మాత్రం లేదని విమర్శించారు.

అంబేద్కర్ చేయాల్సిందంతా చేశారని, కానీ ఇప్పటివరకు ఎవరు పాలించినా ఫలితం ఏమీలేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎనిమిదేళ్లుగా బీజేపీ పరిపాలిస్తున్నా దళితులు అట్టడుగునే ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో అతి తక్కువ డబ్బు లభించే రైతులు దళిత రైతులేనని, రూ.15 వేల కోట్లలో వారికి పోయేది ఓ రూ.1400 కోట్లు మాత్రమేనని సీఎం కేసీఆర్ వివరించారు.

ఇవన్నీ చూసిన తర్వాతే దళితబంధు తీసుకువచ్చామని, ఇది ఒక్కరోజులో జరిగింది కాదని స్పష్టం చేశారు. దళిత్ ఎంపవర్ మెంట్ కింద రూ.1000 కోట్లు కేటాయించామని తెలిపారు.

Related posts

కుప్పంలో రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు..!

Drukpadam

స్పీక‌ర్‌గా కోడెల శివ‌ప్ర‌సాద్‌కూ వైసీపీ మ‌ద్ద‌తు ఇచ్చింది: స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి!

Drukpadam

వ్యాక్సిన్ తయారీ ఆలస్యం అయితే మేము ఉరేసుకోవాలా కేంద్ర మంత్రి సదానంద గౌడ ఆశక్తి కార వ్యాఖ్యలు

Drukpadam

Leave a Comment