Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం జిల్లా ముఠాపురంలో పిడుగు పడి ఇల్లు ధ్వంసం :గాయాలతో బయటపడ్డ కుటుంబం…

ఖమ్మం జిల్లా ముఠాపురంలో పిడుగు పడి ఇల్లు ధ్వంసం :గాయాలతో బయటపడ్డ కుటుంబం…
-ఇంటిపక్కనే ఉన్న మర్రిచెట్టుపై పడ్డ పిడుగు
-మర్రిచెట్టు ఇంటిపై పడటంతో కుప్పకూలిన ఇల్లు
-సమన్లు అన్ని పగిలి పోవడం ఇరిగి పోవడం జరిగింది.
-గ్రామానికి వెళ్లిన రెవెన్యూ అధికారులు :నష్ట వివరాలు సేకరణ

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మూటపురం గ్రామంలో పిడుగుపాటు కి ఒక పెద్ద మర్రి వృక్షం పై పడి ఆ చెట్టు కూలి ఇంటి పై పడి పున్నం రాంబాబు ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది ఇంట్లో ఉన్నటువంటి సభ్యులకు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డ పోయారు ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం దెబ్బతిన్నాయి.

 

ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలలో పిడుగులతో గూడిన వర్ష కురిసింది. నేలకొండపల్లి మండలం ముఠాపురంలో ఒక ఇంటి పక్కన ఉన్న మర్రి చెట్టుపై పిడుగు పడటంతో అదికాస్తా పక్కనే ఉన్న ఇంటిపే పడింది. దీంతో ఇల్లు మొత్తం కుప్పకూలింది. ఇంట్లో ఉన్న సమన్లు ధ్వంసం అయ్యాయి. గోడలు కూలి ఇల్లు మొత్తం నేలమట్టమైంది. ఆ సందర్భంగా ఇంట్లో ఉన్న వారు చిన్నచిన్న గాయాలతో బయట పడ్డారు. ఇంటి యజమాని రాంబాబు జరిగిన విషయం స్థానిక అధికారులకు వివరించారు. ఇంటిపై పడ్డ చెట్టును తొలగించే పనిలో ఉన్నారు.

Related posts

శ్రీవారి లడ్డూ వివాదంపై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు!

Ram Narayana

షటిల్ ఆడుతుండగా గుండెపోటు.. సీపీఆర్ చేసినా దక్కని ప్రాణాలు…

Drukpadam

కరోనా తర్వాత నిద్రలేమితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది: సజ్జనార్‌

Drukpadam

Leave a Comment