Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సీఎం గారు కుర్చీ ఎక్కడ …పోడుభూముల ధర్నాలో నాయకుల ప్రశ్న ?

సీఎం గారు కుర్చీ ఎక్కడ …పోడుభూముల ధర్నాలో నాయకుల ప్రశ్న ?
-పోడుభూములకు పట్టాలు ఇవ్వాలి
-అడవి బిడ్డలను తన్ని తరిమేసి చర్యలను ఆపండి.
-అడవి నుండి ఆదివాసులను తన్ని తరిమి వేయడమే నా?

ఈసారి అధికారంలోకి రాగానే నేనే వచ్చి కుర్చీ వేసుకొని కూర్చొని పోడుభూముల సమస్యలు పరిష్కరిస్తా గిరిజనులకు పట్టాలిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత వాటి గురించి విస్మరించిన వైఙ్నానాన్ని తప్పుపట్టాయి. పోడుభూములనుంచి గిరిజనులను బయటకు తన్ని తరిపే కార్యక్రమాన్ని చేపట్టటం పై ప్రతిపక్షాలు మండిపడ్డాయి . మంగళవారం ఖమ్మం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో సిపిఎం ,సిపిఐ , కాంగ్రెస్ , సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ , ఇంటి పార్టీ లు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా పోడుభూముల సమస్యపై ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోగా పోవడాన్ని నాయకులూ తప్పు పట్టారు. వివిధ పక్షాల నాయకులూ మాట్లాడుతూ ….ప్రభుత్వ చర్యలను గర్హించారు.

గిరిజనులకు అటవీ హక్కుల చట్ట ప్రకారం హక్కులు కల్పిస్తాం , గిరిజనులకు కూడా రైతు బంధు, రైతు బీమా రావాలి ,వాళ్ళు మన బిడ్డలే అంటూ సీఎం కేసీఆర్ గారు 2019 జూలై లో నిండు సభ అసెంబ్లీలో మాట్లాడారు. 2007 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆనాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేయించగా ఒక్క తెలంగాణలోనే 13 లక్షల ఎకరాల్లో గిరిజనులు సాగు చేస్తున్నట్లు వెల్లడైన విషయం నిజం కదా ? అని ప్రశ్నించారు.
తెలంగాణలో ఏ జిల్లాకు సీఎం పోడు భూముల పై పర్యటనలకు వచ్చిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు . . పట్టాలు ఇవ్వలేదు. సీఎం హామీలు మాటలు నీటి మూటలుగానే మిగిలి పోయాయని విమర్శించారు. రాజ్యాంగంలోని 7వ షెడ్యూలు ప్రకారం వ్యవసాయ రంగం, భూముల పట్టాలు, రిజిస్ట్రేషన్లు, పంటల ప్రణాళికలు, మార్కెట్లో ధరలు రాష్ట్ర ముఖ్యమంత్రి పరిధిలో ని విషయాలుఅని మీరు చదివిన పుస్తకాల్లోఎక్కడా తారసపడలేదా? పోడు భూములకు పట్టాలు ఇస్తానని మీరు ఇచ్చిన హామీని వదిలేసి, ఈరోజు కొత్తగా అధికార పక్షం, ప్రతిపక్షం కలిసి అసెంబ్లీలోతీర్మానం చేసి కేంద్రానికి పంపుదామని అంటున్నారు . ఎవరిచెవిలో గులాబీ పూలు పెడుదామనుకుంటున్నరు. హరితహారం, అభయారణ్యాల పేరుతో గిరిజనుల ను సాగు భూములనుండి గెంటేసి, లక్షల ఎకరాల భూమిని సేకరించి, వ్యాపార వర్గాల వారు ,భూస్వాములు, పండ్ల తోటలు, వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటికే వెయ్యిల ఎకరాలు గిరిజనుల భూములు కార్పొరేట్, మైనింగ్ సంస్థల వశం అయినది .అయ్యా కేసీఆర్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో గిరిజనులు ఉన్నారు. కానీ, మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులు ఆధునిక సౌకర్యాల కు దూరంగా పోడు వ్యవసాయం చేసుకుంటూ , ప్రకృతి లోకలసి, గూడెంలో ఉన్న వారంతా కలిసి,మెలసి , జీవిస్తారు. ఎవరిని అడిగినా ఒకటే మాట ..అడవిలో పుట్టి, అడవిలో పెరిగినాము.మేము ఎక్కడికి వెళ్ళటం అంటున్నారు. మాపొడు భుములను ప్రభుత్వము అండతో బలవంతంగా గుంజుకుంటున్నారు. ఇక్కడి గాలి పిలిచిన ఇక్కడి నీళ్లు తాగిన ఎన్నో రకాల జబ్బులు మాయమైపోతాయి. ఈ బడా బాబులు వచ్చిన తర్వాత అడవిని నరుకుతున్నారు. కందకాలు త్రవుతున్నారు. వాగులు ,వంకల్లో జలపాతల్లన్నికలుషితమవుతున్నాయి. ఆ బడా బాబు లే కాకుండా ఇంకా బయటి దేశాల నుండి వచ్చేకార్పొరేట్ శక్తులకు ఫ్యాక్టరీలు పెట్టుకోవడం కోసం సాగు భూములన్నీ వారికి ఇవ్వడం కోసం రకరకాల జీవోలు, తెచ్చి ప్రభుత్వం వారి తాబేదార్లకు ధారద్ధతం చేస్తున్నారు. మా అడవి ప్రాంతంలో సారపాక లో ఐటిసి ఫ్యాక్టరీ పెట్టినారు అందులో అడవి బిడ్డలకు 10 శాతం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు .థర్మల్ పవర్ స్టేషన్ పెట్టినారు. దానిలో ఎంత మంది గిరిజన బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చినారు? అశ్వాపురం లో పెద్ద ఫ్యాక్టరీ పెట్టినారు. పది శాతం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. లక్షల కిలోమీటర్ల అడవి ప్రాంతంలో వ్యాపించి ఉన్న సింగరేణి లో మూడవ వంతుల మంది ,మైదాన ప్రాంతం వారే ఉద్యోగాలు చేస్తూ, మా మీద పెత్తనం చేస్తున్నారు. మా అడవి ప్రాంతం బయ్యారం, మాదారం నుండి లక్షల కోట్ల విలువ చేసే ఇనుము , డోలమైట్ను తరలించుకుపోతున్నారు. మా ఏజెన్సీ ప్రాంతం నుండి గోదావరి ,తాలిపేరు, శబరి నదుల ద్వారా సుమారు 18 వందల టి.ఎం.సి నీటిని తరలించుకుపోతున్నారు.మా అడవిలో ఉన్న ఖనిజ సంపదనంతా తరలించుకుపోతున్నారు .మా ఉద్యోగాల అన్నీ మీరే కొల్లగొడుతున్నారు. పాలకులు ,భూస్వాములు, కార్పొరేట్ శక్తులు అందరూ కలిసి ఆర్థిక ,రాజకీయ, స్వాలంభన పోడు చేసుకుని జీవిస్తున్న ఆదివాసి, గిరిజనుల భూములను బలవంతంగా లాకోడంవలన కొండకోనల్లో కి, దట్టమైన అడవిలోకి పారిపోవడం జరుగుతుంది. తక్షణమేగిరి జనులకు పోడు భూములకు సంబంధించి, హక్కు పత్రాలు ఇవ్వాలి. గిరిజనుల పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలని అఖిల పక్షం ధర్నాలో నాయకులూ డిమాండ్ చేశారు.

Related posts

మళ్ళీ కేసీఆర్ నోట థర్డ్ ఫ్రంట్ మాట …

Drukpadam

ఏపీకి ప్రత్యేక హోదా లేదు.. మ‌రోమారు కేంద్రం స్ప‌ష్టీక‌ర‌ణ‌!

Drukpadam

ఈటల తనను కలవలేదు ఫోన్ లో సంప్రదించారు కలిస్తే తప్పేంటి:కిషన్ రెడ్డి

Drukpadam

Leave a Comment