Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ముస్లిం మేధావి మౌలానా ఖెలీక్ సిద్దిక్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్…

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముస్లింలపట్ల వివక్షత చూపడంపై నిరసన…
-అసోం లో అరెస్ట్ చేసిన ముస్లిం మేధావి మౌలానా ఖెలీక్ సిద్దిక్ ను విడుదల చేయాలి
-మతపెద్దలపైన జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని

ముస్లింల పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్షత కు వ్యతిరేకంగా ఖమ్మంలోని ధర్నా చౌక్ లో ముస్లిం ల ఆధ్వరంలో జరిగిన ధర్నాలో వివిధ పార్టీల నాయకులూ , ముస్లిం మతపెద్దలు పాల్గొన నిరసన తెలిపారు.

 

నేడు ఖమ్మం ధర్నా చౌక్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమానికి ముస్లిం మతాపెద్దలతో సహా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరై ప్రసంగించారు. మొహ్మద్ జవాద్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన సభలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజల మధ్య విభేదాలు పెడుతుందని ప్రత్యేకంగా ముస్లింల పట్ల వివక్షత చూపిస్తూ పాలన సాగిస్తుందని.ఆరోపించారు.ఇటీవల అస్సాంలో జరిగిన సంఘటన యావత్ ప్రపంచం చూసింది. అక్కడ గళం విప్పి మాట్లాడిన ముస్లిం మేధావి మౌలానా ఖెలీక్ సిద్దిక్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విభజించి పాలించు అనే సూత్రాన్ని బిజెపి ప్రభుత్వం అక్షరాల పాటిస్తుందని అన్నారు. స్వతంత్ర భారత్లో అందరికి సమాన హక్కులు కల్పించబడ్డాయని.వర్గాలుగా చేయటం మంచి పద్ధతి కాదన్నారు. చట్టాలు తెచ్చి రైతులిబ్బంది కలిగిస్తున్నారని.వారిపైనే దౌర్జన్యం చేస్తున్నారని ఇది ప్రజా క్షేమం కాదన్నారు.మతపెద్దలు మాట్లాడుతూ దేశంలో ఏ వర్గాన్ని అన్యాయం జరిగినా మేము వారి పట్ల గళం విప్పి అన్యాయాన్ని వ్యతిరేకిస్తామని అన్నారు. మతపెద్దలపైన జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని హెచ్చరించారు.సభలో పాల్గొన్న రాజకీయ పార్టీల నాయకులు ముక్త కంఠంతో జరుగుతున్న దౌర్ర్జన్యాలను ఖండిస్తూ మాట్లదారు. భారీగా జరిగిన కార్యక్రమంలోమౌలాన సయీద్ అహ్మద్ ఖాస్మి.మౌలానా అబ్దుల్ గాని.మౌలానా ముజీబ్.యండి .అబ్రార్.అబ్దుల్ రావూఫ్ ఖాన్. సిపిఐ రాష్ట్ర నాయకులు భాగం హేమంతారావు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్. శ్రీనివాసరావు.సీతయ్య. భాస్కరరావు.ఖదీర్.పాషా. ఖాలక్.ఇమ్రాన్. ఆశిష్.అజీజ్ తదితరులు పాల్గొన్నారు.సంఘీభావంగా ధర్నా చౌక్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

Related posts

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో భారత్ చిత్తు చిత్తు..10 వికెట్లతో గెలిచిన ఇంగ్లాండ్ !

Drukpadam

జర్నలిస్ట్ ల సమస్యలను ప్రధాన మంత్రికి దృష్టికి తీసుకు వెళ్తా … కేంద్రమంత్రి కిషన్ రెడ్డి !

Drukpadam

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాట రాసిన బెంగాల్​ సీఎం మమత!

Drukpadam

Leave a Comment