Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలురాజకీయ వార్తలు

లాఖిమ్ పూర్ లో ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి వాహనం: వ‌రుణ్ గాంధీ!

లాఖిమ్ పూర్ లో ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి వాహనం: వ‌రుణ్ గాంధీ!
-రైతులు చిందించిన రక్తానికి జవాబుదారీ అవసరమ‌ని వాఖ్య
-లఖింపూర్‌ ఖేరీలో రైతులపైకి కారు దూసుకెళ్లిన‌ ఘ‌ట‌న‌..
-ఇంత‌కు ముందు కూడా ఓ వీడియో వైర‌ల్
-అందులో దృశ్యాలు స‌రిగ్గా క‌నిపించ‌ని వైనం
-రైతుల‌కు న్యాయం చేయాల‌ని కొత్త వీడియో పోస్ట్ చేసిన వ‌రుణ్
-రైతుల్లో క్రూరత్వం ప్రవేశించక ముందే వారికి న్యాయం జరగాలని ఆయ‌న డిమాండ్

వరుణ్ గాంధీ బీజేపీ ఎంపీ …. రైతులపై వాహనం నడిపి వారి మరణానికి కారణమైంది బీజేపీ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా … కానీ అక్కడ జరిగిన సంఘటనపై వరుణ్ గాంధీ స్పందించారు. తనకు లభించిన వీడియో ను ఆయన పోస్ట్ చేశారు. అందులో ప్రశాంతంగా నీరసం తెలుపుతున్న రైతులపైకి వాహనం పోనిచ్చి వారి మృతికి కారణమైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా వైఖరికి వరుణ్ గాంధీ పోస్ట్ చేసిన వీడియొ వైరల్ అవుతుంది. నిజానికి రైతులు తమదారిలో తాము వెళ్ళుతున్నారు. వెనకనుంచి వచ్చిన కేంద్రమంత్రి వాహనం నిరసన కారుల ర్యాలీ పైనుంచి అత్యంత వేగంగా వెళ్లి పోయింది. దీనిని రైతులు గమనించలేదు. వారు దారిన వారు పోతుండగా జరిగిన సంఘటన … దీనిపై వరుణ్ గాంధీ స్పందిస్తూ హత్యల ద్వారా నిరసన తెలుపుతున్న రైతుల గళాన్ని అణచలేరని వ్యాఖ్యానించారు. రైతులు చిందించిన రక్తానికి జవాబుదారీ తనం అవసరం అని , లేకపోతె వారిలో క్రూరత్వం ప్రశిస్తుందని అది జరగకముందే వారికీ న్యాయం చేయాలనీ అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో చోటుచేసుకున్న హింసలో ప‌లువురు రైతులు మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాలంటూ నిర‌స‌న తెలుపుతోన్న రైతుల పైనుంచి కారును పోనివ్వ‌డం దేశ వ్యాప్తంగా క‌ల‌కలం రేపింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్ప‌టికే బ‌య‌ట‌కు రాగా అందులో దృశ్యాలు స్ప‌ష్టంగా క‌న‌ప‌డ‌లేదు. అదే ఘ‌ట‌న‌కు సంబంధించిన‌ బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ తాజాగా మ‌రో వీడియోను పోస్ట్ చేశారు. ఇందులోని దృశ్యాలు స్ప‌ష్టంగా ఉన్నాయి.

ఈ వీడియో స్పష్టంగా ఉందని, హత్యల ద్వారా నిరసనకారుల గ‌ళాన్ని అణ‌చివేయ‌లేమ‌ని వ‌రుణ్ గాంధీ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. రైతులు చిందించిన రక్తానికి జవాబుదారీ అవసరమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. నిర‌స‌న తెలుపుతోన్న‌ రైతుల్లో క్రూరత్వం ప్రవేశించక ముందే వారికి న్యాయం జరగాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

Related posts

కర్నూలు జిల్లాలో తన్నుకున్న సీఐ, లాయర్…

Drukpadam

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

Ram Narayana

విజయవాడలో దారుణం… డాక్టర్ కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

Ram Narayana

Leave a Comment