Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సమంతను ప్రీతమ్ జుకాల్కర్ జీజీ అని పిలిచేవారు …జీ జీ అంటే అక్క: మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ …

సమంతను ప్రీతమ్ జుకాల్కర్ జీజీ అని పిలిచేవారు …జీ జీ అంటే అక్క: మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ …
-స‌మంత‌ను అత‌డు అక్క అని పిలిచేవాడు..
-అపార్థం చేసుకోవ‌ద్దు: స‌మంత‌ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్
-ప్రీతమ్ జుకాల్కర్ పై నెటిజ‌న్ల ఆరోప‌ణ‌లు
-అతడి వల్లే చై-సామ్ విడిపోయార‌ని విమ‌ర్శ‌లు
-గ‌తంలో స‌మంత‌ను జీజీ అని పిలిచిన ప్రీత‌మ్
-జీజీ అంటే ఏంటో తెలియ‌క నానార్థాలు తీసిన నెటిజన్లు
-జీజీ అంటే అక్క అని అర్థాన్ని వివ‌రించిన సాధ‌న సింగ్‌

సమంత ,నాగచైతన్య విడాకుల వ్యవహారం లో సోషల్ మీడియా లో వస్తున్నా వార్తలపై సమంత మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ స్పందించారు. సమంతను ప్రీతమ్ జుకాల్కర్ జీజీ అని పిలిచేవారని జీజీ అంటే అక్క అని అర్థమని అందువల్ల వారిమధ్య ఎదో ఉండనే అర్థం వస్తున్నా పుకార్లపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. జీజీ అంటే ఏమిటో తెలియక నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారని అన్నారు. జీ జీ అంటే గూగుల్ కు వెళ్లి చర్చ చేస్తే తెలుస్తుందని పేర్కొన్నారు.

టాలీవుడ్ న‌టులు సమంత-నాగ చైతన్యల పెళ్లి బంధానికి స్వ‌స్తి ప‌ల‌క‌డంతో సమంత పర్సనల్ స్టయిలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ పై నెటిజ‌న్లు తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తోన్న విష‌యం తెలిసిందే. అత‌డి వ‌ల్లే ముచ్చ‌టైన స‌మంత‌-నాగ‌చైత‌న్య జంట విడిపోయింద‌ని కొంద‌రు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అందుకు సాక్ష్యంగా ప్రీతమ్ జుకాల్కర్ గ‌తంలో సామాజిక మాధ్య‌మాల్లో చేసిన కొన్ని వ్యాఖ్య‌ల‌ను చూపెడుతున్నారు.

గ‌తంలో తాను స‌మంత‌తో క‌లిసి సంతోషంగా గ‌డిపాన‌ని తెలుపుతూ ఆమెను ప్రీత‌మ్ జీజీగా సంబోధిస్తూ పోస్ట్ చేశాడు. అయితే, జీజీ అంటే ఏంటో తెలియ‌క నెటిజ‌న్లు ఎన్నో అర్థాలు తీస్తున్నారు. ఈ నేప‌థ్యంలో స‌మంత‌ను ప్రీతమ్ జుకాల్కర్ అక్క అని పిలిచేవాడ‌ని సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ త‌న సామాజిక మాధ్యమ ఖాతా స్టోరీస్‌లో చెప్పారు. వారి మధ్య ఉన్న అనుబంధాన్ని అందరూ అపార్థం చేసుకుంటున్నార‌ని అన్నారు.

‘జీజీ’ అంటే ‘అక్క’ అని అర్థం అని వివ‌రిస్తూ ఆమె గూగుల్ ట్రాన్స్‌లేష‌న్ స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేశారు. త‌నకు ఈ రోజు షూట్ లేనపోవ‌డంతో, భ‌గ‌వంతుడు నాకు తెలివిని ప్రసాదించడంతో ఈ పోస్టు చేస్తున్నాన‌ని చుర‌క‌లంటించారు. కొందరు తెలివిలేని వాళ్లకు దీన్ని షేర్ చేయాలనుకుంటున్నాన‌ని చెప్పారు. కాగా, ఇక‌నైనా ప్రీతమ్ జుకాల్కర్ పై ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాల‌ని స‌మంత ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఇళ్లలో మగవారి వేధింపులే కారణం’.. ప్రత్యేకించి పలుకుబడి ఉన్న కుటుంబాలేనంటూ సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ పోస్ట్!
ఆ వెంటనే డిలీట్ చేసిన వైనం
నిజస్వరూపాన్ని ఇళ్లలోనే దాచేస్తున్నారని కామెంట్
మానసిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ పోస్ట్

సమంత–చైతూ విడాకుల తర్వాత నెటిజన్లు.. ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ పై విమర్శల వర్షం కురిపించారు. అతడి వల్లే అద్భుతమైన జంట విడాకులు తీసుకుందంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. అయితే, సమంత మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ గట్టి కౌంటర్ ఇచ్చి వారి నోర్లు మూయించింది.

అయితే, ఇప్పుడు సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్ పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. ఆ వెంటనే పోస్ట్ ను డిలీట్ చేసినా అప్పటికే అది చాలా మందికి చేరిపోయింది. ‘‘కొన్ని కుటుంబాలు కొంతమంది మగవారి నిజస్వరూపాన్ని ఇళ్లలోనే దాచేస్తున్నాయి. ప్రత్యేకించి సమాజంలో పలుకుబడి ఉన్న కుటుంబాలే అలా చేస్తున్నాయి. మహిళలపై హింసకు వారే బాధ్యులు. ఇప్పుడు వేధింపులు మానసిక రూపంలో జరుగుతున్నాయి. విమర్శల పేరిట సాగుతున్నాయి’’ అంటూ పోస్ట్ పెట్టాడు. అయితే, ఆ పోస్ట్ ను అతడు డిలీట్ చేశాడు.

పోస్ట్ లో సామ్, చైతూల పేర్లను ఎక్కడా పేర్కొనలేదు. అక్కినేని కుటుంబాన్నీ ప్రస్తావించలేదు. నెటిజన్లు మాత్రం ఇది కచ్చితంగా చైతూ–సామ్ విడాకులనుద్దేశిస్తూ పెట్టిన పోస్టేనని చర్చించుకుంటున్నారు. అసలు ఆ పోస్ట్ ఎందుకు పెట్టాడు? ఎందుకు తీసేశాడు? అన్న చర్చ జరుగుతోంది.

 

Related posts

ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్!

Drukpadam

సీఎం పదవిపై ఆసక్తి చూపిస్తున్న ‘మెట్రో మ్యాన్’

Drukpadam

ఢిల్లీలో మోదీని క‌లిసిన బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్.. కీల‌క వ్యాఖ్య‌లు!

Drukpadam

Leave a Comment