Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

లకిం పూర్ ఖేరి ఘటనలో తనకేపాపం తెలియదు ….కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా!

లకిం పూర్ ఖేరి ఘటనలో తనకేపాపం తెలియదు ….కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా!
-నేను కారులోగానీ, కాన్వాయ్ లోగానీ లేను.. ఇవిగోండి సాక్ష్యాలు..
-పోలీసుల విచారణలో కేంద్ర మంత్రి కుమారుడు
-ఇవాళ విచారణకు హాజరైన ఆశిష్ మిశ్రా
-లఖింపూర్ ఖేరి ఘటనపై వివరణ
-తాను దంగల్ లో ఉన్నానని వెల్లడి
-సాక్ష్యంగా వీడియో, పది మంది వాంగ్మూలాలు

ఎట్ట‌కేల‌కు లఖింపూర్ ఖేర్ హింస ఘ‌ట‌న‌లో విచార‌ణ‌కు హాజ‌రైన కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా తనకేపాపం తెలియదని తానుకు లకిం పూర్ ఖేర్ ఘటన కు సంబందించిన విషయంలో ఏ పాపం తెలియదని అన్నారు. అందుకు కావాల్సిన సాక్ష్యాలను కూడా విచారణ అధికారులకు వీడియో రూపంలో అందించారు. ఆసమయంలో దంగల్ లో ఉన్నానని పోలిసుల విశ్చరణలో వెల్లడించారు. నిన్ననే విచారణకు రావాల్సి ఉన్న ఆశిష్ మిశ్రా ఆరోగ్య కారణాల వలన రాలేకపోయారని తండ్రి కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా తెలిపారు. చివరకు
విచార‌ణ‌కు రాక‌పోతే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారుల హెచ్చ‌రిక‌ నేపథ్యంలో విచారణ కు హాజరైన ఆశిష్ మిశ్రా తాను ఆ కార్యక్రమంలో లేనని అప్పుడు దంగల్ ఉన్నానని దానికి సాక్ష్యం గా వీడియో ను విచారణ అధికారులకు అందించారు.

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఇవాళ పోలీసుల విచారణలో కీలక విషయాలను వెల్లడించారు. లఖింపూర్ ఖేరిలో రైతుల మీదకు కారు దూసుకెళ్లినప్పుడు తాను ఆ కాన్వాయ్ లోగానీ, కారులో గానీ లేనని క్రైం బ్రాంచ్ పోలీసులకు స్పష్టం చేశారు. ఆ సమయంలో తాను దంగల్ లో ఉన్నానని చెప్పారు. దానికి సంబంధించిన వీడియోలను పోలీసులకు అందజేశారు. దాంతో పాటు పది మంది సాక్షుల వాంగ్మూలాలనూ దానికి జత చేశారు. డీఐజీ ఉపేంద్ర అగర్వాల్ నేతృత్వంలోని సిట్ ఆశిష్ ను విచారించింది.

వాస్తవానికి శుక్రవారం ఉదయమే ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉన్నా రాలేదు. అయితే, అనారోగ్యం కారణంగా రాలేకపోయారని అజయ్ మిశ్రా వివరణ ఇచ్చారు. దీంతో అధికారులు తాజా సమన్లు ఇవ్వడంతో ఆయన విచారణకు వచ్చారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గురువారం ఇద్దరిని అరెస్ట్ చేశారు.

మీడియా ప్రశ్నలకు నో ఆన్సర్ ….

యూపీలోని లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర స‌హాయ‌ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఎట్ట‌కేల‌కు ఈ రోజు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఆయన పోలీసుల విచారణకు నిన్న గైర్హాజ‌రైన విష‌యం తెలిసిందే. ఈ రోజు కూడా విచార‌ణ‌కు రాక‌పోతే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సిట్ అధికారులు హెచ్చ‌రించారు. దీంతో ఆయ‌న విచార‌ణ‌కు వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌నను మీడియా ప‌లు ప్రశ్న‌లు అడ‌గ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా మాట్లాడ‌కుండానే క్రైం బ్రాంచ్ ఆఫీస్‌ లోప‌లికి వెళ్లారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రాను ప్రస్తుతం అధికారులు ప్రశ్నించగా వీడియో సాక్ష్యం చూపించారు. కాగా, యూపీలోని లఖింపూర్ ఖేరి ఘ‌ట‌న‌లో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నం రేపింది. ఈ కేసులో ఇప్ప‌టికే ఎవ‌రినీ అరెస్టు చేయ‌క‌పోవ‌డంపై ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు మండిప‌డుతున్నారు.

Related posts

ప్రతిపక్షాలపై ఈడీ కక్ష …అవి రాజకీయ ప్రేరేపితం అంటున్న విశ్లేషకులు!

Drukpadam

బీజేపీని ఓడించలేమని తేల్చేసింది: కాంగ్రెస్‌కు థ్యాంక్స్ చెప్పిన స్మృతి ఇరానీ..!

Drukpadam

కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు మహిళల మానప్రాణాలు తీసి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నడు: ష‌ర్మిల‌

Drukpadam

Leave a Comment