Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కొనసాగుతున్న బెల్లంపల్లి సీఓఈ విద్యార్ధుల హవా …..

కొనసాగుతున్న బెల్లంపల్లి సీఓఈ విద్యార్ధుల హవా …..

– డిల్లీ యూనివర్సిటీ కళాశాలలకు ఎంపికైన ముగ్గురు విద్యార్ధులు.
– సిఫ్నెట్ లో అడ్మిషన్ పొందిన నలుగురు విద్యార్ధులు.
– హోటల్ మేనేజ్ మెంట్ కోర్సుకు ఎంపికైన ఐదుగురు.
– మారిటైల్ యూనివర్సిటీ చెన్నై కు ఒక్కరు.
– అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఈఈ అద్వాన్స్డ్ కు 22 మంది.

ఫలిస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు ప్రత్యేక వ్యూహం.
– విద్యార్ధుల ఆసక్తిని బట్టి ఉన్నత విద్య ప్రవేశాలకు శిక్షణ ఇస్తున్న అధ్యాపకులు.

తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ( సిఓఈ)విద్యార్ధులు ఉన్నత చదువులకై నిర్వహించే పలు రకాల ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభతో డిల్లీ యూనివర్సిటీ లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తెలిపారు.

శుక్రవారం డిల్లీ యూనివర్సిటీ ప్రకటించిన ఫలితాల్లో బెల్లంపల్లి సిఓఈ విద్యార్ధులు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఏకంగా ముగ్గురు ఎంపికై బెల్లంపల్లి సత్తా చాటిన విద్యార్ధులను ప్రిన్సిపాల్, అహ్ద్యాపకులు అభినందించారు. గుడి సుశందర్ రెడ్డి హిందూ కాలేజి లో బిఏ (ఆనర్స్) ఫిలాసఫీ,జంగం నాం దేవ్ ద్యాల్ సింగ్ కాలేజిలో బియస్సీ( ఆనర్స్) కంప్యూటర్ సైన్స్, మీసాల రాజసాగర్ ఆచార్య నరేంద్రదేవ్ కాలేజి లో బియస్సీ( ఆనర్స్) కంప్యూటర్ సైన్స్ కోర్సులకు గాను అడ్మీషన్స్ పొందారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డిల్లీ యూనివర్సిటీ పరిదిలోని కలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు తమ విద్యార్ధులు ముగ్గురు ఎంపిక కావడంపట్ల ప్రిన్సిపాల ఐనాల సైదులు సంతోషం వ్యక్తంచేశారు.

ఇప్పటికే సిఫ్నెట్, హోటల్ మేనేజ్ మెంట్, మారిటైల్ యూనివర్సిటీ, జేఈఈ అడ్వాన్స్డ్ కు ఎంపికై బెల్లంపల్లి సత్తాను చాతారు. ఇదే హవా కొనసాగించడం పల్ట్ల విద్యార్ధుల తల్లిదండ్రుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.కళాశాలలో హయ్యర్ ఎడ్యుకేషన్ సెల్ ఏర్పాటు చేసి దానీఅద్వర్యంలో అధ్యాపకులు ఇస్తున్న ప్రత్యేక శిక్షణ, ప్రిస్నిపాల్ సైదులు పర్యవేక్షణ విద్యార్ధుల విజయాలకు మార్గం వేస్తుందని అధికారులు ప్రశంసిస్తున్నారు. ఈ సందర్బంగా ఆదిలాబాద్ సంక్షేమ గురుకులాల ప్రాంతీయాధికారి(ఆర్సీఓ) కొప్పుల స్వరూపరాణి, ఏఆర్సీఓ కోటిచింతల మహేశ్వర రావులు విద్యార్ధులను , అధ్యాపక బ్రుందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కోట రాజ్ కుమార్, అధ్యాపకులు శ్రీరామ వర్మ, మిట్ట రమేష్, చందా లక్ష్మీనారాయణ, అశోక్, కట్లరవీందర్,అనిరుద్, గాజుల రాజేందర్,చిలివేరు సాగర్,ఆకెనేపల్లిరాజేష్, విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related posts

చనిపోలేదు…మాట్లాడలేకపోతున్నానంతే.. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద!

Drukpadam

Financial Firm TD Ameritrade Launches Chatbot For Facebook

Drukpadam

The Healthiest Smoothie Orders at Jamba Juice, Robeks

Drukpadam

Leave a Comment