Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ సీఎం జగన్ ను ఎమ్మెల్యే రోజా కాకాపడుతున్నారా ?

ఎమ్మెల్యే రోజా సీఎం జగన్ కు కప్పిన శాలువా ప్రత్యేకత ఏంటో చూశారా..!

  • -తిరుపతి, తిరుమలలో సీఎం జగన్ పర్యటన
  • -నిన్న తిరుపతి వచ్చిన సీఎం
  • -ఘనస్వాగతం పలికిన వైసీపీ నేతలు
  •  -అందుకే ప్రత్యేకమైన శాలువా కప్పారా?
  • -మంత్రి పదవికోసమే అంటూ నానాపాట్లు
  • -ప్రత్యేకంగా రూపొందించిన శాలువాతో సీఎంకు రోజా సత్కారం

 

నగరి ఎమ్మెల్యే రోజా సీఎం జగన్ దృష్టిలో పడేందుకు ప్రతిసారి తాపత్రపడుతుంటారు ….అందువల్ల ఆమె మంత్రి పదవి కోసం సీఎం ను కాకాపడుతున్నారా ? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు …     సీఎం జగన్ తిరుపతి పర్యటన సందర్భంగా ఆమె ప్రత్యేకంగా తయారు చేయించిన శాలువాతో సీఎం ను సత్కరించారు. దానిపై పార్టీ గుర్తులు , పేరుతొ దగ్గరుండి తయారు చేయించినట్లు తెలుస్తుంది. ఇది చూసిన సీఎం జగన్ ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు.

సీఎం జగన్ నిన్న, నేడు తిరుపతి, తిరుమలలో పర్యటించడం తెలిసిందే. నిన్న తిరుపతి వచ్చిన ఆయనకు వైసీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. నగరి ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో సీఎం జగన్ ను సత్కరించారు. ప్రత్యేకంగా తయారుచేయించిన శాలువాను ఆయనకు కప్పారు. ఆ శాలువాపై అన్నీ జగన్, వైఎస్సార్ బొమ్మలే ఉండడం విశేషం. సీఎం రాకను పురస్కరించుకుని ఆ పట్టు శాలువాను రోజా దగ్గరుండి మరీ తయారుచేయించారు. సీఎం జగన్ సన్మానించినప్పటి ఫొటోలను రోజా తన ఫేస్ బుక్ ఖాతాలో పంచుకున్నారు. జగన్ అభిమానులను ఈ ఫొటోలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

Related posts

మహారాష్ట్రలో సీఎం కుర్చీ చుట్టూ రాజకీయాలు …అజిత్ పవర్ ఆసక్తికర వ్యాఖ్యలు ..

Drukpadam

చంద్రబాబుకు క్షమాపణలు చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సోదరుడు!

Drukpadam

పంజాబ్‌ కాంగ్రెస్‌లో సంక్షోభానికి సిద్ధూనే కారణం: అమరీందర్ భార్య ఆరోపణ!

Drukpadam

Leave a Comment