Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మావోయిస్టు అగ్రనేత ఆర్కే (రామకృష్ణ) ఇక లేరు …

మావోయిస్టు అగ్రనేత ఆర్కే (రామకృష్ణ) ఇక లేరు
ఛత్తీస్ ఘడ్ అడవుల్లో చనిపోయినట్లు సమాచారం
దీర్ఘకాల వ్యాధితో బాధపడుతూ కన్నుమూత
వైయస్ హయాంలో నక్సల్స్ తో జరిపిన చర్చల్లో ఆర్కే కీలక పాత్ర
ఆయనపై అనేక కేసులు .. తలపై రివార్డులు

మావోయిస్టు అగ్రనేత ఆర్కే (రామకృష్ణ ) అలియాస్ అక్కిరాజు హరగోపాల్ ఛత్తీస్ ఘడ్ లో చనిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన ఆర్కే మావోయిస్టు పార్టీ లో అగ్రనేతగా ఉన్నారు. సిద్ధాంతాన్ని బోధించడంలో దిట్టగా ఆయనకు పేరుంది . దేశంలోని మావోయిస్టు పార్టీకి వేళ్ళమీద లెక్కబెట్టదగిన అగ్ర నాయకుల్లో ఆర్కే ను రెండు మూడవ స్థానంలో చెప్పుకుంటారు. వ్యూహాలు రచించడంలో , ఎత్తుగడల్లో , ఆయన కీలకంగా వ్యవహరించారు. గతంలో కూడా ఒకటి రెండు సందర్భాలలో నక్సల్స్ కు , పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆర్కే మరణించినట్లు ప్రచారం జరిగింది. అనేక సార్లు ఆయన తృటిలో తప్పించుకున్నారు . ఆయనకు అంత్యంత సురక్షితమైన భద్రతా ఉంటుంది . సభలు సమావేశాలు , సిద్ధాంతాలు భోదించడంలో ఆయనకు చాల నైపుణ్యం ఉందని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. ఆయన టార్గెట్ లక్ష్యంగా పెట్టుకుంటే అది ఫెయిల్ అయ్యే అవకాశాలు చాల అరుదుగా ఉంటాయని అంటుంటారు.

డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత నక్సల్స్ ను చర్చలకు ఆహ్వానించారు.ఆసందర్భంలో అప్పుడు పీపుల్స్ వార్ గా పిలవబడుతున్న మావోయిస్టు పార్టీ నుంచి రామకృష నేతృత్వంలో ఒక బృందం అడవుల నుంచి బయటకు వచ్చింది. ప్రభుత్వం తో చర్చల సందర్భంగా అడవుల నుంచి ఎలా వచ్చారో అలాగనే వారు తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని షరతు పెట్టారు. అదే విధంగా వారు వచ్చిన దారినే తిరిగి వెళ్ళేందుకు కావాల్సిన వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం చర్చల్లో ఆర్కే నే కీలకంగా వ్యవహరించారు.

తరువాత కాలంలో ఉద్యమ అవసరం ఎక్కడుంటే ఆయన ఎక్కడ కు వెళ్లేవారని తెలుస్తుంది. చాలాకాలంగా ఆయన ఆరోగ్యం పై వదంతులు వస్తూనే ఉన్నా వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని సందర్భాలలో ఆడవుల్లో , మరికొన్ని సందర్భాలలో పట్టణాల్లో వైద్య సేవలు ను పలువురు మావోయిస్టులు పొందారు. రామకృష్ణ కు కూడా నాయకత్వం చికిత్స అందించినప్పటికీ కోలుకోలేదని సమాచారం … ఆయన సౌత్ బస్తర్ లో మరణించినట్లు తెలుస్తుంది …అయితే మావోయిస్టు పార్టీ దీనిని ఇంకా నిర్దారించలేదు…

 

Related posts

The Workout Plan To Get Ripped Without Breaking A Sweat

Drukpadam

ఎపిలో బస్సుకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

Drukpadam

సరదాగా సైకిల్ తొక్కుతూ కిందపడిన అమెరికా అధ్యక్షుడు బైడెన్.. 

Drukpadam

Leave a Comment